వినూత్న రీతిలో కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన కందుల సంధ్యారాణి
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జులై 23: రామగుండం నియోజకవర్గ లింగాపూర్ గ్రామంలో ఇండ్ల నరేష్ స్వప్నల పొలంలో కేటీఆర్ పైన ఉన్న అభిమానంతో వినూత్న రీతిలో వరి నారుతో హ్యాపీ బర్త్డే టు యు కేటీఆర్ అని రాసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి వినూత్న రీతిలో జడ్పిటిసి కందుల సంధ్యారాణి రైతులతో కలిసి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. రైతుబంధు,రైతు బీమా,కాలేశ్వరం లాంటి మహా ప్రాజెక్ట్, నిరంతరం ఉచిత కరెంటు లాంటి పథకాలతో రైతుల కష్టాలు తీర్చిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదినని పురస్కరించుకొని వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాల వల్లనే రైతులు ఈరోజు సంతోషంగా ఉన్నారని తెలియజేస్తూ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సరోజ,శ్యామల,భాగ్య,అమీనా,విజ్జక్క,రమా,లచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!