పేదలు వేసుకున్న గుడిషెలకు పట్టాలు ఇవ్వాలి సిపిఎం
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 18: ఈరోజు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో సాయంకాలంలో పెద్దపెల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి యాకయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సిపిఎం బహిరంగ సభకు ముఖ్య నాయకులైన రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,రాష్ట్ర సీనియర్ నాయకులు బి.భిక్షమయ్య,రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ పాల్గొని మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 70 ఎకరాలలో 4000 గుడిసెలు వేసుకొని పేద ప్రజలు రెండు నెలలుగా ఇంటి స్థలాలకోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా పేద ప్రజలకు ఇంటి స్థలాలు కేటాయించాలని,ఇంటి స్థలం ఉన్న వారికి మూడు లక్షలు కాదు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇంటి కిరాయిలు కట్టుకొని నివసించే పరిస్థితి పేద ప్రజలకు లేదని వారి ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుని వారికి పట్టాలివ్వాలని అలా ఇవని పక్షంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి మేము పోరాటం చేస్తామని పేద ప్రజలకు అండగా ఉంటామని సిపిఎం పార్టీ తరుపున మేమున్నామని హామీ ఇస్తున్నామన్నారు. ఈ భూ పోరాటం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోనే కాదు మంచిర్యాల, వరంగల్, భూపాలపల్లి జిల్లా కేంద్రాలలో కొనసాగుతుందని వారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా కార్యవర్గ సభ్యురాలు మహేశ్వరి,సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!