పోలీస్ సిబ్బంది సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలి
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఏప్రిల్ 29: రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో గోదావరిఖని సబ్ డివిజన్ సివిల్ పోలీస్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి శనివారం వీక్లీ పరేడ్ నిర్వహించడం జరిగింది. ఈ పరేడ్ కి ఏఆర్ అడిషనల్ డీసీపీ రియాజ్ హుల్ హక్ హాజరై గౌరవ వందనం స్వీకరించి, సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, ట్రాఫిక్ డ్రిల్, సెర్మోనల్ డ్రిల్ సిబ్బంది ప్రదర్శించిన ప్రదర్శనలు పరిశీలించారు. సిపిఆర్ విధానాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని డిజిపి ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ రేమ రాజేశ్వరి ఐపీఎస్(డిఐజి)ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్స్ ఆధ్వర్యంలో ఏఆర్, ట్రాఫిక్, సివిల్ హోంగార్డ్స్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సిపిఆర్ (కార్డియా ఫుల్మనరి రిససిటేషన్) పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ రియాజ్ హుల్ హక్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాద ఘటనలలో ప్రాణాలు కాపాడడంలో సిపిఆర్ ప్రక్రియ చాలా కీలకంగా పనిచేస్తుందని ఈ విధానంపై పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని అనుకోనీ సంఘటనలు (ప్రమాదాలు) జరిగిన సమయంలో మనిషి గుండె స్తంభించినప్పుడు ఊపిరితిత్తులు శ్వాస తీసుకోవడం సమస్యగా మారినప్పుడు ప్రాణాలు కాపాడడం కోసం హృదయ శ్వాస కోశ పునరుద్ధరణ చాలా కీలకంగా పనిచేసి స్తంభించిన గుండె తిరిగి పనిచేసే విధంగా సిపిఆర్ ప్రక్రియ ఉపయోగపడుతుందని చెప్పారు. అయితే సిపిఆర్ ప్రక్రియ ఏ విధంగా చేయాలనే విషయాన్ని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రధానంగా కరెంట్ షాక్ తగిలినప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయినప్పుడు శ్వాస సమస్యలు వచ్చి గుండె ఆగిపోయినప్పుడు సిపిఆర్ ప్రక్రియ ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు. ఇలాంటి సమయంలో ఛాతిపై బలంగా పలు మార్లు నొక్కడం వల్ల ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని చెప్పారు. పోలీస్ సిబ్బంది అందరికీ సిపిఆర్ ప్రక్రియ పట్ల పూర్తి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఏసిపి సుందర్ రావు,ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్,గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు, ఆర్ ఐ సుధాకర్, శ్రీధర్, అనిల్, డాక్టర్స్ తిరుమల, చంద్రశేఖర్, ఆస్మా మెడికల్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్ కృష్ణ పి హెచ్ సి ఎస్ ఐ లు, ఆర్ఎస్ఐలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!