మానవత్వం చాటుకున్న నార్కెట్పల్లి వాసి
స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, అక్టోబర్ 14: తనకు దొరికిన సెల్ ఫోన్ ను పోగొట్టుకున్న వ్యక్తికి అందజేసి మానవత్వం చాటుకున్న సంఘటన శనివారం నార్కెట్పల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నార్కట్పల్లికి చెందిన నీలం వీరయ్య సాయంత్రం మార్కెట్కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో రోడ్డుమీద మొబైల్ ఫోన్ దొరికింది. వెంటనే వీరయ్య తనకు దొరికిన ఫోను ను పోలీస్ స్టేషన్లో అప్ప చెప్పేందుకు వెళ్లగా ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు పోతినేనిపల్లి గ్రామానికి చెందిన ఆదిమల్ల ప్రవీణ్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేందుకు వెళ్లి అక్కడే ఉన్నాడు అది గమనించిన వీరయ్య పోలీసుల సమక్షంలో బాధితునికి మొబైల్ ఫోన్ ను అప్పజెప్పాడు నిజాయితీగా ఫోన్ తెచ్చి ఇచ్చిన వీరయ్యను పోలీసులు అభినందించారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!