క్షణ కాలాన్ని తర తరాలపాటు చూపించేది ఫోటోగ్రఫీ
స్వేచ్చ న్యూస్, నార్కట్పల్లి, ఆగస్టు 19: క్షణ కాలాన్ని బంధించి భవిష్యత్ తరాలకు అప్పటి జ్ఞాపకాన్ని చూపించేది ఛాయాచిత్ర కళ అని నార్కెట్పల్లి మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కన్నెబోయిన నరసింహ పేర్కొన్నారు. శనివారం 184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నార్కెట్పల్లి మండల సంగం ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం పట్టణ కేంద్రంలో మునుగోడు రోడ్డు నుంచి అమ్మనబోలు రోడ్డు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితంలో మధుర క్షణాలను జ్ఞాపకాలుగా మలిచి భవిష్యత్తుకు అందించి అలనాటి స్మృతులను కళ్ళ ముందు ఉంచడం ఒక్క ఫోటోగ్రఫీ రంగానికే సాధ్యమని తెలిపారు. ప్రపంచంలో అందరూ నవ్వుతూ ఉండాలని కోరుకునే ఒకే ఒక నిస్వార్థ వ్యక్తి ఫోటోగ్రాఫర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి గౌరీదేవి నరసింహ, కోశాధికారి నీలం శివరాం, జిల్లా ప్రచార కార్యదర్శి కొమ్ము గిరి, నాయకులు సోమ వెంకటరెడ్డి, తిరుమల్ సతీష్, వెంకన్న, లింగస్వామి, సురేష్, శ్రీమాన్, మల్లేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!