సింగరేణి ప్రైవేట్ పరం కానివ్వం

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 9: సింగరేణి కార్మికుల ఆశీర్వాద యాత్రలో భాగంగా పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ బుధవారం ఉదయం ఆర్ జీ వన్ ఏరియా పరిధిలోని టు ఇంక్లైన్ గని,వర్క్ షాప్ కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని,సింగరేణిని ప్రైవేట్ పరం కానివ్వమని తెలిపారు.సింగరేణి యజమాన్యం బోగ్గు ఉత్పత్తితోపాటు కార్మికులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.రానున్న ఎన్నికలలో తనకు ఒక అవకాశం ఇవ్వాలని కార్మికులను కోరారు.ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి,కార్పోరేటర్లు మహంకాళి స్వామి,ఎండి ముస్తఫా,నాయకులు తాళ్లపల్లి యుగంధర్,కొప్పుల శంకర్,నాయని ఓదేలు,దూళికట్ట సతీష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share this…
0 replies

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *