జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలే సాధనగా డిజేఎఫ్ జర్నలిస్టుల గర్జన సభ
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జులై 25: డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పెద్దపెల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని తిలక్ నగర్ లో గల విశ్వం ఫంక్షన్ హాల్ లో ఈరోజు జర్నలిస్టుల ఇండ్ల స్థలాలే సాధనగా జర్నలిస్ట్ ల గర్జన సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జాతీయ స్థాయి నాయకులు,గౌరవ అధ్యక్షులు విశ్వనాధ్,అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి,రాష్ట్రస్తాయి నాయకులు అధ్యక్షులు రత్నాకర్ పటేల్,ప్రధాన కార్యదర్శి కొత్త యాదిరెడ్డి, పెద్దపల్లి జిల్లాస్థాయి నాయకులు అధ్యక్షులు సబితం లక్ష్మణ్,ప్రధాన కార్యదర్శి ఇంజం సాంబశివరావులు మాట్లాడుతూ అక్రిడేషన్తో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులకు రావాల్సిన ఇండ్ల స్థలాలు ప్రభుత్వ పథకాలు హక్కులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిన్న పెద్ద పత్రికలని వేరు చేసి మాట్లాడే వారికి సరైన సమయంలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సమాధానం చెబుతుందని అన్నారు. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు కోరుకంటి చందర్ డిజెఎఫ్ లో సభ్యత్వం కలిగిన ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు ఇన్సూరెన్స్ కల్పిస్తానని మాట ఇచ్చారని డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు అన్నారు.వివిధ జిల్లాల నుంచి వర్షాన్ని కూడ లేక్క చేయకుండా వచ్చిన నాయకులకు జర్నలిస్టులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.మంచిర్యాల జిల్లా నుండి అధిక సంఖ్యలో జర్నలిస్టులను తీసుకువచ్చిన ఆ జిల్లా అధ్యక్షునికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.జర్నలిస్ట్ మిత్రులు అందరితో కలిసి పనిచేయడం నేర్చుకోవాలని కలంకు ఉన్న విలువ తెలుసుకుంటూ సమాజానికి తెలుపుతు ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ న్యూస్ బృందం మాతంగి శివరాజ్,కోదాటి వినోద్ కుమార్, కోదాటి వినోద్ కుమార్,నీలం కుమార్,మిట్టపల్లి అశోక్,గోషిక లక్ష్మణ్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన డీజేఎఫ్ సభ్యులు రామగుండం జిల్లా లోని చిన్న పెద్ద ఎలక్ట్రానిక్ ఫ్రింట్ మీడియా మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!