ఆపదలో ఉన్న పూర్వ విద్యార్థుల కు సహాయమే లక్ష్యంగా స్వాన్

స్వేచ్ఛ న్యూస్, డిసెంబర్ 17, నార్కెట్పల్లి: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నార్కెట్పల్లి లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆపదలో ఉన్న సమయంలో ఆర్థికంగా సామాజికంగా ఇతర సహాయ సహకారాలు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిందే స్వాన్ (స్టూడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ నార్కెట్ పల్లి) సంస్థ అని ఆ సంస్థ వ్యవస్థాపకులు మామిళ్ళ సత్తిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నార్కట్పల్లి పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఉరుకులు పరుగుల జీవితంలో ఎంతోమంది ఆర్థికంగా సామాజికంగా నష్టపోతున్నారని తాను చదువు చెప్పిన పాఠశాలల్లోని పూర్వ విద్యార్థులు ఎవరు కూడా ఇలాంటి ఇబ్బందులకు గురికాకుండా తన వంతుగా సేవ చేయాలనే ఉద్దేశంతో పూర్వ విద్యార్థులందరినీ ఏకం చేసి ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సంస్థలో సభ్యులుగా చేరిన వారికి సాధ్యమైనంత మేరకు ఆర్థిక సహాయం అదేవిధంగా వారి పిల్లల ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం మరే ఇతర సహాయ సహకారాలు కావాలన్నా తన అనుభవంతో కూడిన సలహాలు, సూచనలు అందించనున్నట్లు తెలిపారు. పూర్వ విద్యార్థులు అందరూ ఒక చోట చేరి తమ ఐక్యతను చాటుకున్నట్లయితే సభ్యుల సమస్యలకు పరిష్కారాలు లభించి ఆ సంఘంలోని సభ్యులందరికీ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. జడ్పీహెచ్ఎస్ నార్కెట్పల్లి లో చదివిన పూర్వ విద్యార్థులందరూ సంఘంలో చేరి సంఘ అభివృద్ధికి తోడ్పడి తద్వారా వారు కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఐక్యత అభివృద్ధికి చిహ్నంగా ఉంటుందని విద్యార్థులందరూ ఐక్యంగా ఉన్నప్పుడు వారి అభివృద్ధి సహజంగానే మెరుగుపడుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో మెరుగు శ్రవణ్ కుమార్, దామెర నవీన్, ఉదయ్, సంజీవ, జానయ్య, సత్తయ్య, వెంకట్ రెడ్డి, అమరేందర్ నరసింహ, ప్రదీప్, స్వాతి, కవిత తదితరులు పాల్గొన్నారు.

Share this…
0 replies

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *