సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 7: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రజాహిత సంక్షేమ పథకాలకు ఆయన పాలనకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం గోదావరిఖని జవహర్లాల్ స్టేడియంలో 12వ డివిజన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బుర్ర వెంకటేష్ తో పాటు మరో పదిమంది ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందిస్తూ ప్రతి ముఖంలో ఆనందం నింపుతున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ది అన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ,అభివృద్ధి పథకాలను అమలచేస్తూంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక రావు,నాయకులు బొడ్డు రవీందర్,మాదాసు రామ్మూర్తి, పసుల బాబు,ఓదేలు తదితరులు పాల్గొన్నారు.

Share this…
0 replies

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *