నేను తీసుకు వచ్చిన పనులను ఇప్పటికీ పూర్తి చేయలేదన్న సత్యనారాయణ

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, నవంబర్ 4: స్వతంత్ర అభ్యర్థి సమారపు సత్యనారాయణ ఈరోజు పోతన కాలనీ,19వ డివిజన్ న్యూ మారేడువాక లో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసే వాడిని ప్రతి డివిజన్ లో కమిటీ హాల్స్,మహిళా భవనాలకు నిధులు సమకూర్చాన కానీ ఇప్పటివరకు ఆ పనులు పూర్తి చేయలేదన్నారు. నేను తీసుకు వచ్చిన వందల కోట్ల రూపాయల పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని నన్ను గెలిపిస్తే 24 గంటలు మంచి త్రాగునీరు అందిస్తానని ఈ ప్రాంతాన్ని గ్రీన్ సిటీగా మార్చి ఈ ప్రాంతాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దానన్నారు.వరల్డ్ బ్యాంకు నుండి నిధులు తీసుకువచ్చే సత్తా తనకు ఉందని ఆ నిధులతో రామగుండం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా రూపుదిద్దుతానన్నారు. ఈ ఎలక్షన్స్ నాకు చివరి ఎలక్షన్స్ అని మళ్లీ మీరు ఓటు వేసి నన్ను గెలిపిస్తే ఈ ప్రాంత రూపురేఖలు మార్చి చూపిస్తానని కొంతమంది వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మిమ్మల్ని మోసం చేయడానికి ముందుకు వస్తున్నారు.అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోమారపు లావణ్య అరుణ్ కుమార్,మాజీ మేయర్ జాలి రాజమణి,కుసుమ,మాజీ కార్పొరేటర్ రవి నాయక్,కడారి సురేష్,లక్ష్మీనారాయణ,రాజేష్ నాయక్,బిక్షపతి,చంద్రశేఖర్ గౌడ్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Share this…
0 replies

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *