కూరగాయల అంగడి స్థల వివాదంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలి: సిఐ శివరాం రెడ్డి
స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జూన్ 20: నార్కట్పల్లి పట్టణంలో మసీదు ఎదురుగా ఉన్న (కూరగాయల అంగడి) స్థలానికి సంబంధించిన వివాదానికి సంబంధించి మంగళవారం నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ శివరాం రెడ్డి, స్థానిక ఎస్సై సైదాబాబు ల ఆధ్వర్యంలో ఇరువర్గాలను కూర్చోబెట్టి సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ స్థల వివాదాలకు సంబంధించి ఎవరైనా చట్ట ప్రకారం అందుబాటులో ఉన్న డాక్యుమెంట్ల ఆధారంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని ఇరువర్గాలకు సూచించారు. ఈ వివాదంలో కోర్టు తీర్పులు సైతం ఉన్నాయని వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోట్ కూడా ఉన్నందున సంబంధిత ఆధారాలను పరిశీలించనున్నట్టు పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ వివాదం కొనసాగుతున్నందున దీనికి కలెక్టర్ స్థాయిలో పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నదని ఇరువర్గాలు సమర్పించిన డాక్యుమెంట్లను పరిశీలించి పై అధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు. రెండు వర్గాల వారికి సంబంధించిన పెద్ద మనుషులు, స్థానిక అధికారుల సమక్షంలో ఇరువురికి నచ్చజెప్పి పంపించారు. ఈ విషయంపై ఎవరు కూడా ఎలాంటి ఆరోపణలు కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కానీ పాల్పడినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!