శ్రీకృష్ణార్జున దేవాలయంలో అఖండ సుదర్శన యాగం

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జులై 28: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41 డివిజన్ హనుమానగర్ లో గల శ్రీ కృష్ణార్జున దేవాలయంలో శుక్రవారము ఉదయం 5:30 నుండి 7 గంటల వరకు వేద పండితులు శ్రీ కృష్ణార్జున దేవాలయం అర్చకులు రమేష్ అయ్యగారు ఆధ్వర్యంలో గోదావరిఖని రామాలయం అయ్యగారు శ్రావణ్ వేద మంత్రోచ్ఛారణతో శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు, అలంకారాలు చేసి తొమ్మిది గంటల నుండి 12:45 నిమిషాల వరకు14 జంటలతో నాలుగు హోమ గుండాలు వేసి రామగుండం ప్రజలు హోమంలో పాల్గొన్న భక్తులు సుఖశాంతులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని సుదర్శన యాగం నిర్వహించి తీర్థప్రసాదాలు ఇవ్వడం జరిగింది. అనంతరం అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీ కృష్ణార్జున దేవాలయం ధర్మకర్త అమలానంద సునీత స్వామి సేవకులు మహంకాళి సంపత్ మెండే ఓదెలు పురుషోత్తం రమేష్ బూడిద లింగయ్య రాజు వైనాల భారతమ్మ మారేపల్లి సారమ్మ నిర్వహించిన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ శ్రీకృష్ణ భగవానుని కృపకు పాత్రులు అయ్యారు.

Share this…
0 replies

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *