పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తెలుసుకున్న ఠాగూర్
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 19: ఈరోజు ఉదయం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విట్టల్ నగర్ జోన్ సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులను పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో ప్రకారం జీతాలు రాక కాంట్రాక్ట్ కార్మికులు శ్రమ దోపిడికి గురవుతున్నారని, సమయానికి జీతాలు రాక అప్పులు చేసుకొని దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్నారని ఆవేదన చెందారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు కార్మికుల జీవితాలు బాగు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మహంకాళి స్వామి,ఎండి ముస్తఫా,నాయకుడు చుక్కల శ్రీనివాస్,తాళ్లపల్లి యుగంధర్, బొంతల లచ్చన్న,వీరబోయిన రవి,కాంటాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!