కార్మికుల హక్కుల సాధనకై పోరాడుదాం 138 వ మే డే ను ఘనంగా నిర్వహిద్దాం,
స్వేచ్ఛ న్యూస్, ఏప్రిల్ 27, రామగుండం: అంతర్గాం మండలము ఐఎఫ్టియు ఆధ్వర్యంలో 138వ మే డే వాల్ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంఘ జిల్లా నాయకులు గుమ్మడి వెంకన్న పెండ్యాల రమేష్ తీగుట్ల రాములు, కట్ట తేజేశ్వర్ కొట్టే తిరుపతి లు మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం పని గంటలకు వ్యతిరేకంగా కార్మిక వర్గమంతా 138 సంవత్సరాల క్రితమే చికాగో పోరాటం ఫలితంగా ఎనిమిది గంటల పని దినాన్ని సాధించిన రోజు అనేక హక్కులను సాధించడం కోసం ఎంతోమంది కార్మిక నేతలు అమరులై తమ రక్తంతో తడిసిన ఎర్రజెండాను కార్మికుల పోరాటాల జెండాగా అందించిన మే డే దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం అంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపైన పోరాటం చేస్తూ మేడే నిర్వహించాలని పిలుపునిచ్చారు .కార్మికులకు కనీస వేతనాలు పని భద్రత 12 తగ్గింపు చేయాలని డిమాండ్ చేశారు నిజజీవితంలో సరిపడే వేతనాలు ఇవ్వడం లేదన్నారు స్థానికంగా ఉన్న ఎన్ టి పి సి ఆర్ఎఫ్సిఎల్ కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ సింగరేణిలో వందలాదిమంది కాంటాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు వారికి జీవో ప్రకారం వేతనాలు ఇవ్వడం లేదని అన్నారు ఎల్లంపల్లి పంప్ హౌస్లలో ప్రాజెక్టుల పైన పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సరిగా జీతాలు ఇవ్వడం లేదని అన్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు ఇవ్వకపోవడంతోకుటుంబాలను పోషించుకోలేకపోతున్నారన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వాలు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేనియెడల పెద్ద ఎత్తున పోరాటాల నిర్వహిస్తామని హెచ్చరించారు. అశోకు రాజేందర్ లు పాల్గొన్నారు.

Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!