మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన చెరువుగట్టు కాంగ్రెస్ నాయకులు

స్వేచ్ఛ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్ 19: రాష్ట్ర రోడ్డు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంగళవారం చెరువుగట్టు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, దేవస్థానం సిబ్బంది తదితరులు హైదరాబాదులోని వారి స్వగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో అర్చకులు మంత్రికి వేదమంత్రోచ్ఛారణతో ఆశీర్వచనం చేసి చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసి స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నేతకానీ కృష్ణయ్య, పున్నపురాజు యాదగిరి, గడుసు శశిధర్ రెడ్డి, వారాల రమేష్, రెగట్టే రాజ శేఖర్ రెడ్డి, రేగట్టే నవీన్ రెడ్డి, రేగట్టే నర్శి రెడ్డి, కుకుట్లా చంద్రయ్య, మల్గ శంకర్, చీర లింగయ్య, కుకూట్ల శ్రీకాంత్, కట్ట సాయి, కొక రామలింగయ్య, సైది రెడ్డి, జెలెందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాదులోని తన నివాసంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి స్వామివారి చిత్రపటాన్ని బహుకరిస్తున్న చెరువుగట్టు నాయకులు
Share this…
0 replies

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *