నార్కెట్పల్లి కామినేని ఆసుపత్రిలో ఉచిత గుండె వైద్య పరీక్షలు
స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, మే 15: నార్కెట్పల్లి లోని కామినేని వైద్య విద్య కళాశాల అనుబంధ ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలను ఉచితంగా ఈనెల 17న (బుధవారం) నిర్వహించనున్నట్లు హాస్పిటల్ మార్కెటింగ్ హెడ్ సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం కామినేని ఆసుపత్రి ఆవరణలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ అండ్ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ రంగారావు తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో వయోభేదం లేకుండా చిన్న చిన్న వయస్సు వారు కూడా గుండె జబ్బు బారినపడి అకస్మాత్తుగా మరణించడంతో వారిపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురికావాల్సి వస్తుందని చెప్పారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నార్కట్పల్లి కామినేని ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే బుధవారం ఎల్బీనగర్ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ సాగర్, డాక్టర్ విశాల్ లచే చూపించి (కన్సల్టేషన్) అవసరమైన పేషెంట్లకు ఆర్ బి ఎస్, ఈసీజీ, 2d ఎకో పరీక్షలు చేసి తదుపరి వైద్య సేవలు అవసరం ఉన్న పేషెంట్లకు ఉచితంగా వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ ఉచిత క్యాంపులు సద్వినియోగం చేసుకొని రాబోయే రోజులలో వచ్చే గుండె జబ్బులను ముందస్తుగా తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!