రామగుండం ప్రజలు సుభిక్షంగా ఉండాలి:చందర్
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 5: గోదావరిఖని కోదండ రామాలయంలో శుక్రవారం రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ హనుమాన్ భక్తులు నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా అఖండ హనుమాన్ చాలీసా ముగింపు కార్యక్రమంలో హాజరైనారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాక ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు మహర్దశ కల్పించారన్నారు. ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు మెరుగవుతున్నాయన్నారు. హనుమాన్ దీక్ష తీసుకోవడం పూర్వజన్మ సుకృతం, గొప్ప అదృష్టమని తెలిపారు. హనుమాన్ దీక్ష కఠినమైన దీక్ష అని ఏకాగ్రతతో కొనసాగిస్తే భవిష్యత్తులో ఉన్నతమైన జీవితాన్ని పొందుతారని దేవుడి పై నమ్మకంగా ఉంటే సాధించలేనిది ఏమీ లేదన్నారు. రామగుండం ప్రజల శ్రేయసు కోసం ఆలయంలో నిత్యం పూజలు జరుగుతున్నాయని రాబోయే కాలంలో హనుమాన్ దీక్ష పరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కోదండ రామాలయంలో ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్టు చందర్ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నగరం మేయర్ డాక్టర్లు బింగి అనిల్ కుమార్, అడ్డాల గట్టయ్య, పెంట రాజేష్, యువజన నాయకులు దొమ్మేటి వాసు తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!