సింగరేణి బాయి బాట కార్యక్రమం నిర్వహించిన సోమారపు
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 12: శనివారం ఉదయం మాజీ ఎమ్మెల్యే,ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ నిర్వహించిన సింగరేణి భాయి బాట సందర్భంగా ఆర్జీ టు ఏరియా ఓసిపి త్రీ కార్మికులను,వర్క్ షాప్ కార్మికులను కలిసి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుని మాట్లాడుతూ నన్ను మొట్టమొదటిసారిగా రామగుండం మున్సిపాల్ చైర్మన్గా గెలిపించారని మీ ఆశీర్వాదంతో గెలిచి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం,సెవరేజి సిస్టం,అన్ని ఏరియాలలో సిసి రోడ్ల నిర్మాణం చేశానని,సింగరేణి కార్మికులకు,ప్రజలకు 24 గంటలు మంచి త్రాగునీటి సౌకర్యం కల్పించానని అన్నారు.రామగుండం నియోజకవర్గ ఇండిపెండెంట్ శాసనసభ్యునిగా నిలబడిన నన్ను సింగరేణి కార్మికులు,ప్రజలు గెలిపించారని కృతజ్ఞతలు తెలిపారు.నేను ఎన్నడు భూ కబ్జాలు,సెటిల్మెంట్లు,పోలీస్ ఫైరోగులు,గవర్నమెంట్ హాస్పిటల్ ఉద్యోగాలు,సింగరేణి ఓబి కాంట్రాక్ట్ ఉద్యోగాలు,మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగాలు,ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు లాంటి పేద ప్రజల రక్తాన్ని పిల్చే ఎలాంటి పైరవీలు నేను చేయలేదు ఆర్ ఎఫ్ సి ఎల్ ఉద్యోగాలు ఎన్నడూ అమ్ముకోలేదన్నారు.కొంతమంది ప్రజా నాయకులు ప్రజల,కార్మికుల అమయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఉద్యోగాల పేరిట మోసం చేశారని అన్నారు.ముఖ్యంగా మన భారతదేశానికి వెలుగులు నింపే సింగరేణి కార్మికులు సకలజనుల సమ్మె చేసి తెలంగాణ రాష్ట్ర సాధనకై కృషిచేసి సాధించారన్నారు. సింగరేణి కార్మికులకు కార్మిక కుటుంబాలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.మళ్లీ నన్ను రామగుండం నియోజకవర్గ శాసనసభ్యునిగా గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రామగుండం నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ పిడుగు కృష్ణ ముదిరాజ్,సోమవరపు లావణ్య అరుణ్ కుమార్,కార్పొరేటర్ మందల కిషన్ రెడ్డి,దుబాసి లలిత మల్లేష్,కోదాటి ప్రవీణ్,దీటి వెంకటస్వామి,మండల అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ గౌడ్,తోకల అనురాగ్, సింగరేణి కార్మికులు,బిజెపి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!