స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్బంగా ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 21: దివంగత మాజీ ప్రధాని,భారతరత్న అవార్డు గ్రహీత గౌరవ రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం అధ్యక్షులు గట్ల రమేష్ ఆధ్వర్యంలో స్థానిక జిఎం కాలనీ మూలమలుపు వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సంగ్ రాజ్ ఠాకూర్ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచ స్థాయి దేశాలతో పోటీపడే విధంగా ఎలక్ట్రానిక్స్,ఐటీ కమ్యూనికేషన్ రంగాలలో భారత్ అభివృద్ధిని పరుగులెట్టించి అనేక రంగాలలో యువతకు ఉద్యోగ,ఉపాది అవకాశాలు కల్పించిన గొప్పనాయకుడు రాజీవ్ గాంధీ అన్నారు. యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి యువతకు రాజకీయాలలో ప్రోత్సాహం అందించే అవకాశం కలిగించాడన్నారు. ఈదేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకు సేవలందించి ప్రాణాలకు ఇచ్చిన గొప్ప మహానేత అని కొనియాడారు. అలాంటి నేతను స్మరించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నామని అంత గొప్ప నాయకుడు చూపిన దారిలో నడిచి రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో,దేశంలో అధికారంలోకి తెచ్చి మత చాందసవాద కూహన, స్వయం ప్రకటిత దేశభక్తుల నుండి ప్రజలను విముక్తులను చేస్తామని అంతవరకు ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాదరబోయిన రవికుమార్, కార్పొరేటర్లు మహంకాళి స్వామి,ఎండి ముస్తఫా,పెద్దల్లి ప్రకాష్, నాయకులు బొంతల లచ్చన్న,రవియాదవ్,యు గేంధర్, పంజా శ్రీను,నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!