గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న పోలీసులు
స్వేచ్చ న్యూస్, రామగుండం, ఆగస్టు 12: ఈరోజు ఉదయం బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ బయట టాస్క్ ఫోర్స్ పోలీసులను గమనించిన వ్యక్తి పారిపోతుండగా గమనించి అతని పట్టుకొని తనిఖీ చేయగా చిన్న చిన్న ప్యాకెట్లలో సుమారు 500 గ్రాముల డ్రై గంజాయి లభించింది. అతనిని విచారించగా తన పేరు అనుదీప్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నివాసి అని తెలిపాడు. అతను చదువు మధ్యలో ఆపివేసి చెడు అలవాట్లకు బానిసై తను తాగడానికి,తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో మహారాష్ట్ర బల్లార్షాలో ఒక గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలోని అమాయక యువతకు ఎక్కువ రేటుకు అమ్ముతానని తెలపడం జరిగిందన్నారు. నిందితున్ని అతని వద్ద లభించిన గంజాయిని స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కోసం బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించడం జరిగిందన్నారు.

Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!