విద్యార్థులు పర్యావరణ సంరక్షణలో భాగస్వాములు కావాలి
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 2: బుధవారం 38వ డివిజన్ శ్రీ చైతన్య హైస్కూల్ లో హరిత భారత్ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరకట్టి చందర్ పాల్గొని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు వాతావరణ సమతుల్యతను కాపాడే బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహిస్తున్న హరితహారం గొప్ప కార్యక్రమం అని విద్యార్థులు తమ ఇంట్లో ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జంగంపల్లి సరోజన,దాతు శ్రీనివాస్,టిఆర్ఎస్ పార్టీ నాయకులు తోడేటి శంకర్ గౌడ్,బొడ్డు రవీందర్,అచ్చే వేణు,నూనె శంకర్ కుమార్,బాబురావు,మేకల అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!