సీ.ఈ.ఐ.ఆర్. పోర్టల్ ద్వారా రికవరీ చేసిన మొబైల్స్ ఫోన్లను అప్పగించిన పోలీసులు
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఏప్రిల్ 26: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లి సబ్ డివిజన్ తాల్ల గురిజాల పరిధిలోని బట్వనపల్లి గ్రామానికి చెందిన దుర్గం బాలరాజు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను బెల్లంపల్లి ఏసీపి సదయ్య అప్పగించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని సబ్ డివిజన్ ఎన్టిపిసి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంటూరు పల్లికి చెందిన వెంకటస్వామి ఈనెల 18న పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను సిఐ కార్యాలయంలో సిఐ చంద్రశేఖర్ గౌడ్ అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలోని బెల్లంపల్లి ఏసీపీ సదయ్య,గోదావరిఖని ఎన్టీపీసీ సిఐ చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ బట్వనపల్లి గ్రామానికి చెందిన దుర్గం బాలరాజు,ఎన్టిపిసి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంటూరుపల్లికి చెందిన వెంకటస్వామి వారి మొబైల్ ఫోన్ లను పోగొట్టుకొనగా వారి ఆధార్ నెంబర్లను సంబంధిత IMEI నెంబర్లను CEIR పోర్టల్ ద్వారా www.ceir.gov.in వెబ్సైట్లోకి లాగిన్ అయి CEIR అప్లోడ్ చేయగా వారి మొబైల్స్ ను బ్లాక్ చేసి ట్రేస్డ్ డీటెయిల్స్ లోకి వెళ్లి వారి మొబైల్ ఫోన్ సిమ్ కార్డులను వేసిన వారి వివరాలు తెలుసుకొని రామగుండం సబ్ క్రైమ్ వారికి వివరాలు తెలుపగా ఐటీ సెల్ వారు తాళ్ల గురిజాల ఎస్ ఐ నరేష్, ఎన్టిపిసి ఎస్ఐ జీవన్ లకు తెలుపగా వివరాల ఆధారంగా అట్టి మొబైల్స్ ను రికవరీ చేసి బాధ్యతలకు అప్పగించడం జరిగిందన్నారు. ప్రజలు ఎవరివైనా సెల్ ఫోన్లు దొంగిలించబడిన, పోగొట్టుకున్న CEIR ద్వారా www.ceir.gov.inవెబ్సైట్లోకి వెళ్లి అందులో పూర్తి వివరాలు పొందుపరచాలని అలా చేసినట్లయితే వారి మొబైల్స్ ను త్వరగా పట్టుకోవడం జరుగుతుందని CEIR అప్లికేషన్ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సీఐ రాజ్ కుమార్ గౌడ్,తాళ్ల గురుజాల ఎస్సై నరేష్,ఎన్ టి పి సి ఎస్ ఐ జీవన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!