ఠాగూర్ నాయకత్వన కాంగ్రెస్ పార్టీలో చేరిన రైతులు

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 5: డిసిసి అధ్యక్షుడు రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో మునిపెన్నడూ లేని విధంగా నిత్యం భారీ చేరికలతో రోజురోజుకు బలపడుతూ అశేషమైన ప్రజల మద్దతు కూడగడుతూ అహర్నిశలు నియోజకవర్గ ప్రజానీకానికి పనులు చేస్తూ జనహితమే నా జీవితమని నమ్మి అలుపెరుగని నాయకునిగా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్న నాయకుడు ఠాగూర్ నాయకత్వంలో తక్కల్లపల్లి సర్పంచ్ ముక్కెర శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలకుర్తి మండల రైతులు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అకాల వర్షాలకు ఐకెపి సెంటర్స్ లో ఆరబోసిన వరి ధాన్యం మోకాళ్ళ లోతు నీళ్లలో నాని మొలకలు వస్తే అధికార పార్టీలోని నాయకులు,స్థానిక ఎమ్మెల్యే పరామర్శించిన పాపాన పోలేదు అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి రైతు కలత చందుతున్నాడని తక్షణమే అంతర్గం,పాలకుర్తి మండల కేంద్రాలలో రైతులకు భరోసా కల్పిస్తూ జిల్లా కలెక్టర్ తో మాట్లాడి తడిసిన,రంగు మారిన దాన్యంలో ఎలాంటి తరుగు లేకుండా భేషరతుగా కొనాలని సూచించిన మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆయనకు ప్రజల పట్ల ఉన్న నిబద్ధతతో ఇవాళ మేమంతా ఆయన వెంట నడవడానికి సిద్ధమై ఆయన గెలుపు కోసం మేము సైతం పని చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో చేరికైనా రైతులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఎక్స్ ఎంపీపీ ఊరుమెట్ల రాజలింగం,బీసీ సెల్ అధ్యక్షులు పెండ్యాల మహేష్, మండల యువజన అధ్యక్షులు ఓల్లేపు సాయి,పల్లికొండ రాజేష్,మేడి ఓదేలు,కూనారపు ఫ్రేమ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Share this…
0 replies

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *