ఇందారం హత్య కేసు నిందితుల అరెస్టు
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఏప్రిల్ 27: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా జైపూర్ ఏసిపి కార్యాలయంలో ఏసిపి నరేందర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధి ఇందారం గ్రామంలో జరిగిన హత్య కేసు నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించడం జరిగింది. ఈనెల 20వ తేదీన ఇందారం గ్రామానికి చెందిన మృతుడు ముష్కే మహేష్,తల్లి ముష్కె రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగిందన్నారు.హత్య సమాచారం అందగానే జైపూర్ ఏసిపి నరేందర్,శ్రీరాంపూర్ సిఐ రాజు,జైపూర్ ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి హత్యకు గల కారణాలు తెలుసుకొని వివరాలు సేకరించడం జరిగింది అన్నారు. జైపూర్ ఏసిపి నరేందర్ పర్యవేక్షణలో నిందితులను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేసి దానిలో భాగంగా నమ్మదగిన సమాచారం మేరకు నేరం చేసిన నిందితులు మంథని వైపు అక్కడక్కడ తిరుగుతూ ఈరోజు 27.4.2023 నా ఇందారంలోని వారి ఇంటికి వచ్చి బట్టలు,డబ్బులు తీసుకొని ఎవరికి కనబడకుండా వెళదామనుకొని సుమారుగా ఉదయం 5:30 గంటలకు శెట్టుపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఉండగా నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని జైపూర్ ఏసిపి నరేందర్ వెల్లడించారు. నిందితుల వివరాలు (1)పెద్దపల్లి కనకయ్య s/o ఆశాలు,వయసు 44,వృత్తి వ్యవసాయం,గ్రామం ఇందారం(2) సాయి ,వయసు 19,వృత్తి వ్యవసాయం,గ్రామం ఉందారం(3) పద్మ,వయసు 40,వృత్తి వ్యవసాయం,గ్రామం ఉందారం(4) శృతి,వయసు 22,వృత్తి వ్యవసాయం,గ్రామం ఇందారం(5) శ్వేత,వయసు 21,వృత్తి వ్యవసాయం,గ్రామం ఇందారం,స్వాధీన పరుచుకున్న వాటి వివరాలు: ఒక కత్తి నేరస్థుడు వాడిన సెల్ ఫోన్. వివరాల్లోకి వెళితే:పెద్దపల్లి కనకయ్య భార్య పద్మలకు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు వీరు ఇందారం గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు కాగా పెద్ద కూతురు శృతికి 2019 సంవత్సరంలో నజీరుపల్లి గ్రామానికి చెందిన ముష్కే మహేష్ s/oలేట్ రాజమల్లు అను అతనితో పరిచయం ఏర్పడి వారిద్దరూ ప్రేమించుకున్నారు. 2020 సంవత్సరం వరకు వారు ప్రేమించుకున్నారు తర్వాత అతని ప్రవర్తన నచ్చక శృతి అతనిని ప్రేమించడం మాట్లాడడం మానేసింది అప్పటి నుండి మహేష్ శృతి ప్రేమించుకున్నప్పుడు చనువుగా దిగిన ఫోటోని ఆమెకు చూపించి ఫేస్ బుక్ ఇంస్టాగ్రామ్ లో పెడతానని బెదిరించేవాడు ఆ విషయం నిందితుడు కనకయ్యకు తెలిసి మహేష్ ను మందలించినప్పటికీ తన ప్రవర్తన మార్చుకోలేదు మహేష్ 13 6 2022 సంవత్సరంలో శృతి న్యూడ్ వీడియో రికార్డును ఫేస్ బుక్,ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయడం తో మహేష్ పై జైపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా cf No92/2022U/sec354(A),354(C) IPC and sec 66(E),67(A)ACT కేసు నమోదయింది.సోషల్ మీడియాలో వచ్చిన శృతి న్యూడ్ వీడియోలు చూసి అవమానం భరించలేక శృతి భర్త తేదీ 28.9.2022న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషయంలో సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ లో cr No:259/2022,U/sec174cr pc కేసు నమోదు అయింది. మహేష్ రోజు కనకయ్య ఇంటి వైపు వస్తూ హారం కొడుతూ వారిని ఇబ్బంది పెట్టగా తేదీ 9.10.2022న నిందితుని కొడుకు సాయి ఇంటి ముందు నుండి వెళ్తున్న మహేష్ ను ఆపికట్టేతో కొట్టగా మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద్దపెల్లి సాయిపైcr No:162/2022,U/sec 341,290,324,IPC జైపూర్ పోలీస్ స్టేషన్ లు కేసు నమోదయింది.నిందితుడు కనకయ్య జైపూర్ పోలీస్ స్టేషన్లో తన కూతురు శృతి వీడియోలను సోషల్ మీడియాలో పెట్టినందుకు మహేష్ పై పెట్టిన కేసు విషయంలో తేది 17.2.2023రాత్రి కనకయ్య ఇంటి ముందరి గేటును తన్ని పారిపోగా4.3.2023 జైపూర్ పోలీస్ స్టేషన్లో cr No:35/2023, U/sec448,290,506 IPC కేసు నమోదు చేయడం జరిగింది. అతని వల్ల తన కూతురు జీవితం నాశనం అయిందని కూతురు భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని ప్రతిరోజు కనకయ్య ఇంటి ముందరికి వచ్చి బైక్ హారన్ కొడుతూ మానసికంగా వేధించడంతో ఎలాగైనా మహేష్ ను చంపాలని కనకయ్య,భార్య పద్మ కూతురు శృతి,కొడుకు సాయి అనుకొని మహేష్ వారి ఇంటి ముందు నుండి వెళ్లేటప్పుడు అడ్డగించి అతన్ని కత్తితో పొడిచి చంపాలని అనుకున్నారు. అందుకోసం పది రోజుల క్రితం గోదావరిఖని కి వెళ్లి రాజేష్ థియేటర్ వద్ద కత్తులు తయారు చేసే షాపులో కత్తి కొనుక్కొని వచ్చాడు తేదీ 25.4.2023 ఉదయం సుమారుగా 8:30 గంటల ప్రాంతంలో మహేష్ వీరి ఇంటి ముందర నుండి బస్టాండ్ వైపు హారన్ కొట్టుకుంటూ వెళ్తుండగా ఇదే దారిలో వస్తాడని అనుకుని ప్లాన్ ప్రకారం మహేష్ వచ్చేది గమనించి బైక్ పై వస్తున్న మహేష్ ను ఆపి కనకయ్య వెళ్లి టీ షర్ట్ పట్టుకొనగా అతను పారిపోయే ప్రయత్నం చేశాడు ఇంతలో కనకయ్య భార్య కూతురు శృతి కొడుకు సాయి అందరూ కలిసి కత్తి సిమెంట్ ఇటుకలతో దాడి చేయగా బలమైన బలమైన గాయాలు అధిక రక్తస్రావం జరిగి మహేష్ అక్కడికక్కడే చనిపోయాడన్నారు. మీరు ఇక్కడే ఉంటే మహేష్ తరపు వారు దాడి చేస్తారని,పోలీసులు పట్టుకుంటారని నిందితులు అక్కడి నుండి పారిపోయారన్నారు. ఈ పత్రిక సమావేశంలో శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు,జైపూర్ ఎస్సై పాల్గొన్నారు.

Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!