మభ్యపెడుతున్న కాంగ్రెస్ నాయకులు అన్న ఎమ్మెల్యే చందర్
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జులై 24: సోమవారం రాష్ట్ర పురపాలక,ఐటి శాఖ మాత్యులు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మనో చైతన్య,అమ్మ పరివర్,శ్రీ ధర్మశాస్త్ర నిత్త్యాన్నదాన ఆశ్రమాల్లో వేరువేరుగా ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా రామగుండం శాసనసభ్యులు కోరికంటి చందర్ హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం కాకుండా ఓట్ల కోసం రాజకీయం చేసే నాయకత్వాన్ని ప్రజలు తరిమికొట్టాలని అన్నారు. 9 ఏళ్ల సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్ర అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని సీఎం కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ తండ్రికి తగ్గ తనయునిగా రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరంగా కృషి చేస్తున్నారని అన్నారు. మంత్రి కేటీఆర్ దేశాలన్నీ తిరిగి సుమారు 12 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించారని 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి,సంక్షేమానికి నోచుకోక బ్రష్టు పట్టిపోయిందని ఎమ్మెల్యే చందర్ ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంతోనే ప్రతి ఇల్లు సంక్షేమ పథకాలతో చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడానికి ప్రయత్నిస్తుందని చందర్ ఆరోపించారు. సమాజ శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం పాటుపడే నాయకత్వానికి అండగా ఉండాలని ఆయన కోరారు. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్,ఫ్యాక్స్ చైర్మన్ మామిడాల ప్రభాకర్,డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక రావు,కార్పొరేటర్లు బొడ్డు రజిత రవీందర్,దొంత శ్రీనివాస్,బాలరాజ్ కుమార్,కొమ్ము వేణుగోపాల్,జనగామ కవిత,సరోజినీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!