జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చంద్రయాన్ విజయోత్సవ సంబరాలు


స్వేచ్ఛ న్యూస్, ఆగస్టు 23, నార్కెట్ పల్లి: ప్రపంచ చరిత్రలో ఏ దేశానికి సాధ్యం కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ భారతదేశం  చంద్రయాన్ 3 మిషన్ ని చంద్రుని దక్షిణ ధ్రువం పై సాఫ్ట్ లాండింగ్ ద్వారా విజయవంతంగా శాటిలైట్ ను ప్రవేశపెట్టి ప్రపంచ దేశాలకు భారత్ తన సత్తాను చాటిన వేళ ఆ మధుర క్షణాలను పురస్కరించుకొని నల్గొండ జిల్లా, నార్కెట్పల్లి పట్టణ కేంద్రంలో జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అమ్మనబోలు చౌరస్తా నుండి మునుగోడు చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జనగణమన చౌక్ (నల్లగొండ చౌరస్తా) వద్ద జనగణమన జాతీయ గీతాన్ని ఆలపించి, టపాకాయలు కాల్చారు, మిఠాయిలు పంచుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి అధ్యక్షులు కన్నెబోయిన నరసింహ, సభ్యులు నోముల నాగరాజు, గోదల వెంకటరెడ్డి, భాషెట్టి శ్రీనివాస్, శ్రీపతి గణేష్, బండారు రమేష్, పల్లెర్ల నాగరాజు,  గూడూరు అంజిరెడ్డి, జాల వెంకన్న, మునుకుంట్ల గణేష్, రాధారపు బిక్షపతి, శేఖర్, మునుకుంట్ల శ్రీను, నల్లగొండ నాగరాజు, మిట్ట శేఖర్ రెడ్డి, లోకసాని శేఖర్ రెడ్డి, అలుగుబెల్లి దామోదర్ రెడ్డి, పల్లెర్ల సత్యనారాయణ, శ్రీనివాస్, బైరోజు సతీష్, జాల రమేష్, బైరోజు రవి, రాము, బద్దుల బిక్షం, పసునూరి సంపత్, కంచర్ల బాబురావు,  పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

చంద్రయాన్ విజయవంతమైన సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపిస్తూ తమ దేశభక్తిని చాటుతున్న నార్కట్పల్లి ప్రజలు
పట్టణ కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న జనగణమన ఉత్సవ సమితి సభ్యులు
Share this…
0 replies

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *