స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఏప్రిల్ 30: అశోక్ నగర్ ఎస్ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్లో 49వ డివిజన్ కార్పొరేటర్ సన ఫక్రోద్దీన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఈద్ మిలాప్ జమతే ఇస్లామియా హింద్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ సతీమణి మనాలి ఠాగూర్ పాల్గొని పలు మహిళా సమస్యలపై చర్చించి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కార సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలు కార్పొరేటర్లు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
https://swechadailynews.in/wp-content/uploads/2023/04/IMG-20230430-WA0000.jpg9001600adminhttp://swechadailynews.in/wp-content/uploads/2023/04/logo-1-1030x520.pngadmin2023-04-30 14:52:512023-04-30 14:55:39ఈద్ మిలాప్ కార్యక్రమంలో పాల్గొన్న ఠాకూర్ సతీమణి
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఏప్రిల్ 29: గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని సప్తగిరి కాలనీలో 2020 సంవత్సరంలో హైదరాబాదుకు చెందిన రావుస్ విద్యా సంస్థల యజమాన్యం ఇక్కడ ఒక బ్రాంచ్ ని స్థాపించి అందులో సి బి ఎస్ ఈ సిలబస్ ఉందని హంగు ఆర్పాటలతో రంగురంగుల కరపత్రాలను ముద్రించి,వివిధ రకాల డిజైన్ ఫ్లెక్సీలను ముద్రించి ప్రచారం చేసి ఇక్కడి పారిశ్రామిక ప్రాంత విద్యార్థులను వారి తల్లిదండ్రులను నమ్మించి మోసం చేసి అబద్ధపు ప్రచారాలతో విద్యార్థులను చేర్పించుకున్నా రావుస్ విద్యా సంస్థపై చర్య తీసుకోవాలని విద్యాశాఖ మంత్రికి,విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని సిపిఐ నగర కార్యదర్శి కే.కనకరాజ్, సహాయక కార్యదర్శి మద్దెల దినేష్ లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంస్థలో సిబిఎస్ఇ సిలబస్ ను బోధించేందుకు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేవని విద్యార్థులను వారి తల్లిదండ్రులను,ఈ ప్రాంత ప్రజలందరిని మోసం చేశారని విద్యాశాఖ మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నామన్నారు. ఈ రావుస్ విద్యా సంస్థలు ఇచ్చే ముడుపులకు ఆశపడి స్థానిక ఎం.ఈ.ఓ, సంబంధిత విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేసిన పాపాన పోలేదని ఏదైనా సమస్య ఉంటే స్థానిక విద్యా శాఖ అదికారులకు ఫోన్ చేస్తే ఎత్తే పరిస్థితి ఉండదని విచారణ చేసి ఆలోచన కూడా వారికి ఉండదని ప్రభుత్వ ఇచ్చే లక్షలాది రూపాయల వేతనం పొందుతూ విద్యాసంస్థ ఇచ్చే ముడుపులకు ఆశపడి విద్యార్థుల భవిష్యత్తును కాపాడే ప్రయత్నం చేయరని మీ దృష్టికి తీసుకురావడం జరిగిందని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే రావుస్ విద్యాసంస్థ గుర్తింపును రద్దుచేసి పాఠశాలను సీజ్ చేయాలని కమ్యూనిస్టు పార్టీ తరపున కోరుతున్నామని ఆయన మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నామని సిపిఐ నగర సహాయక కార్యదర్శి మద్దెల దినేష్ ఇచ్చిన ప్రకటనలో పెర్కోన్నారు.
https://swechadailynews.in/wp-content/uploads/2023/04/IMG-20230429-WA0001.jpg1076787adminhttp://swechadailynews.in/wp-content/uploads/2023/04/logo-1-1030x520.pngadmin2023-04-29 17:55:342023-04-29 17:56:09రావుస్ విద్యా సంస్థ పై చర్య తీసుకోవాలని విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఏప్రిల్ 29: రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో గోదావరిఖని సబ్ డివిజన్ సివిల్ పోలీస్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి శనివారం వీక్లీ పరేడ్ నిర్వహించడం జరిగింది. ఈ పరేడ్ కి ఏఆర్ అడిషనల్ డీసీపీ రియాజ్ హుల్ హక్ హాజరై గౌరవ వందనం స్వీకరించి, సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, ట్రాఫిక్ డ్రిల్, సెర్మోనల్ డ్రిల్ సిబ్బంది ప్రదర్శించిన ప్రదర్శనలు పరిశీలించారు. సిపిఆర్ విధానాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని డిజిపి ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ రేమ రాజేశ్వరి ఐపీఎస్(డిఐజి)ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్స్ ఆధ్వర్యంలో ఏఆర్, ట్రాఫిక్, సివిల్ హోంగార్డ్స్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సిపిఆర్ (కార్డియా ఫుల్మనరి రిససిటేషన్) పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ రియాజ్ హుల్ హక్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాద ఘటనలలో ప్రాణాలు కాపాడడంలో సిపిఆర్ ప్రక్రియ చాలా కీలకంగా పనిచేస్తుందని ఈ విధానంపై పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని అనుకోనీ సంఘటనలు (ప్రమాదాలు) జరిగిన సమయంలో మనిషి గుండె స్తంభించినప్పుడు ఊపిరితిత్తులు శ్వాస తీసుకోవడం సమస్యగా మారినప్పుడు ప్రాణాలు కాపాడడం కోసం హృదయ శ్వాస కోశ పునరుద్ధరణ చాలా కీలకంగా పనిచేసి స్తంభించిన గుండె తిరిగి పనిచేసే విధంగా సిపిఆర్ ప్రక్రియ ఉపయోగపడుతుందని చెప్పారు. అయితే సిపిఆర్ ప్రక్రియ ఏ విధంగా చేయాలనే విషయాన్ని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రధానంగా కరెంట్ షాక్ తగిలినప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయినప్పుడు శ్వాస సమస్యలు వచ్చి గుండె ఆగిపోయినప్పుడు సిపిఆర్ ప్రక్రియ ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు. ఇలాంటి సమయంలో ఛాతిపై బలంగా పలు మార్లు నొక్కడం వల్ల ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని చెప్పారు. పోలీస్ సిబ్బంది అందరికీ సిపిఆర్ ప్రక్రియ పట్ల పూర్తి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఏసిపి సుందర్ రావు,ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్,గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు, ఆర్ ఐ సుధాకర్, శ్రీధర్, అనిల్, డాక్టర్స్ తిరుమల, చంద్రశేఖర్, ఆస్మా మెడికల్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్ కృష్ణ పి హెచ్ సి ఎస్ ఐ లు, ఆర్ఎస్ఐలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://swechadailynews.in/wp-content/uploads/2023/04/IMG-20230429-WA0005-1.jpg7201280adminhttp://swechadailynews.in/wp-content/uploads/2023/04/logo-1-1030x520.pngadmin2023-04-29 13:18:032023-04-29 13:18:34పోలీస్ సిబ్బంది సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలి
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఎప్రిల్ 29: పౌరా హక్కుల పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మంచిర్యాల పట్టణ ఎస్ఐ తైసినుధ్ధీన్ అన్నారు. మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని అండాలమ్మా కాలనీలో ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం కాలనీ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ భారత రాజ్యాంగం భారత పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందన్నారు. ప్రజలు పౌర హక్కులపై అవగాహన కలిగి ఉన్నప్పుడే సమాజంలో మార్పు వస్తుంది కుల వివక్ష లేకుండా సోదర భావంతో అందరూ కలిసి ఉండాలని అంటరానితనం లాంటి అమానుషమైన చర్యలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, బిసి, ఎస్సి వెల్ఫేర్ అధికారులు ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
https://swechadailynews.in/wp-content/uploads/2023/04/IMG-20230429-WA0008.jpg6521156adminhttp://swechadailynews.in/wp-content/uploads/2023/04/logo-1-1030x520.pngadmin2023-04-29 12:19:392023-04-29 12:20:32పౌర హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి తైసీనుద్దీన్
స్వాతంత్రానికి పూర్వం నార్కట్పల్లిలో నిర్మించిన ఆర్టీసీ బస్సు డిపో ఎత్తివేతకు స్థానిక ఎమ్మెల్యే బాధ్యత వహించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. సిపిఐ జీప్ జాత శనివారం మూడవరోజు నార్కెట్పల్లి పట్టణానికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నార్కెట్పల్లి బస్ డిపో వద్ద ఏర్పాటుచేసిన మీటింగ్లో శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజలు దాదాపు 10 మండలాలకు సంబంధించిన విద్యార్థులు బస్సు పాసుల ద్వారా కాలేజీలకు పోకుండా చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడనుందని ఆయన పేర్కొన్నారు. దశాబ్ద కాలంగా సరిపడా నిధులు కేటాయించకపోవడం వల్ల బీ వేలంలో ప్రాజెక్టు పూర్తికి నోచుకోలేకపోయిందని ఆయన ఆరోపించారు. రైతు లకు రుణమాఫీ చేయకుండా బ్యాంకుల్లో కిస్తీలు కట్టలేక రైతుల అప్పుల పాలవుతున్నారని ఆయన అన్నారు. రెండు సంవత్సరాల క్రితం ప్రకటించిన దళిత బంధు పథకం దళితులకు అందజేయకుండా మోసం చేస్తూ ఆలయాపన చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఏడు సంవత్సరాల క్రితం ప్రకటించిన పెన్షన్లను వెంటనే రెట్టింపు చేసి పేద ప్రజలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రచార జాత కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పెండ్యాల శంకర్, చిట్యాల మండల కార్యదర్శి ఎండి అక్బర్, నకిరేకల్ మండల కార్యదర్శి గౌను లక్ష్మీనరసయ్య, వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ అధ్యక్షులు వెంపటి శ్రీనివాస్, రైతు సంఘం నాయకులు ఏనుగుల యోగేందర్ రెడ్డి, నార్కట్పల్లి పట్టణ కార్యదర్శి శ్రీపతి స్వామి , తోడుసు సైదులు, బీసీ సంఘం మండలాధ్యక్షుడు రావుల చిన్న వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ న్యూస్, ఏప్రిల్ 28, రామగుండం: చదువుకొని ఉండి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఉద్యోగ నియామక ప్రక్రియలో అవకతవకలకు పాల్పడుతూ తెలంగాణ రాష్ట్రo నిరుద్యోగుల పాలిట యమగండం గా మారిందని కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఎన్ ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి దాసరి విజయ్ కుమార్ శుక్రవారం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ బోర్డును తక్షణమే ప్రక్షాళన చేయాలని కోరుతూ చదువుకొని ఉద్యోగం వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులను మోసం చేసిన టిఆర్ఎస్ పార్టీ కి రానున్న రోజుల్లో నిరుద్యోగులు తగిన గుణపాఠం చెప్పాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధమైన చర్యలకు పాల్పడిన టిఎస్పీ ఎస్పీ బోర్డును తక్షణమే ప్రక్షాళన చేయాలని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గారికి గోదావరిఖని లోని పోస్ట్ ఆఫీస్ నుండి రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా నిరుద్యోగుల పక్షాన పోరాటం చేయడం కొరకు ఎన్ ఎస్ యు ఐ ఎప్పుడు అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
https://swechadailynews.in/wp-content/uploads/2023/04/IMG-20230428-WA0012.jpg10801080adminhttp://swechadailynews.in/wp-content/uploads/2023/04/logo-1-1030x520.pngadmin2023-04-28 12:49:222023-04-28 12:49:51నిరుద్యోగుల పాలిట యమగండం టిఎస్పిఎస్సి: ఎన్ ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి దాసరి విజయ్ కుమార్
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఏప్రిల్ 27: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా జైపూర్ ఏసిపి కార్యాలయంలో ఏసిపి నరేందర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధి ఇందారం గ్రామంలో జరిగిన హత్య కేసు నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించడం జరిగింది. ఈనెల 20వ తేదీన ఇందారం గ్రామానికి చెందిన మృతుడు ముష్కే మహేష్,తల్లి ముష్కె రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగిందన్నారు.హత్య సమాచారం అందగానే జైపూర్ ఏసిపి నరేందర్,శ్రీరాంపూర్ సిఐ రాజు,జైపూర్ ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి హత్యకు గల కారణాలు తెలుసుకొని వివరాలు సేకరించడం జరిగింది అన్నారు. జైపూర్ ఏసిపి నరేందర్ పర్యవేక్షణలో నిందితులను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేసి దానిలో భాగంగా నమ్మదగిన సమాచారం మేరకు నేరం చేసిన నిందితులు మంథని వైపు అక్కడక్కడ తిరుగుతూ ఈరోజు 27.4.2023 నా ఇందారంలోని వారి ఇంటికి వచ్చి బట్టలు,డబ్బులు తీసుకొని ఎవరికి కనబడకుండా వెళదామనుకొని సుమారుగా ఉదయం 5:30 గంటలకు శెట్టుపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఉండగా నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని జైపూర్ ఏసిపి నరేందర్ వెల్లడించారు. నిందితుల వివరాలు (1)పెద్దపల్లి కనకయ్య s/o ఆశాలు,వయసు 44,వృత్తి వ్యవసాయం,గ్రామం ఇందారం(2) సాయి ,వయసు 19,వృత్తి వ్యవసాయం,గ్రామం ఉందారం(3) పద్మ,వయసు 40,వృత్తి వ్యవసాయం,గ్రామం ఉందారం(4) శృతి,వయసు 22,వృత్తి వ్యవసాయం,గ్రామం ఇందారం(5) శ్వేత,వయసు 21,వృత్తి వ్యవసాయం,గ్రామం ఇందారం,స్వాధీన పరుచుకున్న వాటి వివరాలు: ఒక కత్తి నేరస్థుడు వాడిన సెల్ ఫోన్. వివరాల్లోకి వెళితే:పెద్దపల్లి కనకయ్య భార్య పద్మలకు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు వీరు ఇందారం గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు కాగా పెద్ద కూతురు శృతికి 2019 సంవత్సరంలో నజీరుపల్లి గ్రామానికి చెందిన ముష్కే మహేష్ s/oలేట్ రాజమల్లు అను అతనితో పరిచయం ఏర్పడి వారిద్దరూ ప్రేమించుకున్నారు. 2020 సంవత్సరం వరకు వారు ప్రేమించుకున్నారు తర్వాత అతని ప్రవర్తన నచ్చక శృతి అతనిని ప్రేమించడం మాట్లాడడం మానేసింది అప్పటి నుండి మహేష్ శృతి ప్రేమించుకున్నప్పుడు చనువుగా దిగిన ఫోటోని ఆమెకు చూపించి ఫేస్ బుక్ ఇంస్టాగ్రామ్ లో పెడతానని బెదిరించేవాడు ఆ విషయం నిందితుడు కనకయ్యకు తెలిసి మహేష్ ను మందలించినప్పటికీ తన ప్రవర్తన మార్చుకోలేదు మహేష్ 13 6 2022 సంవత్సరంలో శృతి న్యూడ్ వీడియో రికార్డును ఫేస్ బుక్,ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయడం తో మహేష్ పై జైపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా cf No92/2022U/sec354(A),354(C) IPC and sec 66(E),67(A)ACT కేసు నమోదయింది.సోషల్ మీడియాలో వచ్చిన శృతి న్యూడ్ వీడియోలు చూసి అవమానం భరించలేక శృతి భర్త తేదీ 28.9.2022న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషయంలో సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ లో cr No:259/2022,U/sec174cr pc కేసు నమోదు అయింది. మహేష్ రోజు కనకయ్య ఇంటి వైపు వస్తూ హారం కొడుతూ వారిని ఇబ్బంది పెట్టగా తేదీ 9.10.2022న నిందితుని కొడుకు సాయి ఇంటి ముందు నుండి వెళ్తున్న మహేష్ ను ఆపికట్టేతో కొట్టగా మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద్దపెల్లి సాయిపైcr No:162/2022,U/sec 341,290,324,IPC జైపూర్ పోలీస్ స్టేషన్ లు కేసు నమోదయింది.నిందితుడు కనకయ్య జైపూర్ పోలీస్ స్టేషన్లో తన కూతురు శృతి వీడియోలను సోషల్ మీడియాలో పెట్టినందుకు మహేష్ పై పెట్టిన కేసు విషయంలో తేది 17.2.2023రాత్రి కనకయ్య ఇంటి ముందరి గేటును తన్ని పారిపోగా4.3.2023 జైపూర్ పోలీస్ స్టేషన్లో cr No:35/2023, U/sec448,290,506 IPC కేసు నమోదు చేయడం జరిగింది. అతని వల్ల తన కూతురు జీవితం నాశనం అయిందని కూతురు భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని ప్రతిరోజు కనకయ్య ఇంటి ముందరికి వచ్చి బైక్ హారన్ కొడుతూ మానసికంగా వేధించడంతో ఎలాగైనా మహేష్ ను చంపాలని కనకయ్య,భార్య పద్మ కూతురు శృతి,కొడుకు సాయి అనుకొని మహేష్ వారి ఇంటి ముందు నుండి వెళ్లేటప్పుడు అడ్డగించి అతన్ని కత్తితో పొడిచి చంపాలని అనుకున్నారు. అందుకోసం పది రోజుల క్రితం గోదావరిఖని కి వెళ్లి రాజేష్ థియేటర్ వద్ద కత్తులు తయారు చేసే షాపులో కత్తి కొనుక్కొని వచ్చాడు తేదీ 25.4.2023 ఉదయం సుమారుగా 8:30 గంటల ప్రాంతంలో మహేష్ వీరి ఇంటి ముందర నుండి బస్టాండ్ వైపు హారన్ కొట్టుకుంటూ వెళ్తుండగా ఇదే దారిలో వస్తాడని అనుకుని ప్లాన్ ప్రకారం మహేష్ వచ్చేది గమనించి బైక్ పై వస్తున్న మహేష్ ను ఆపి కనకయ్య వెళ్లి టీ షర్ట్ పట్టుకొనగా అతను పారిపోయే ప్రయత్నం చేశాడు ఇంతలో కనకయ్య భార్య కూతురు శృతి కొడుకు సాయి అందరూ కలిసి కత్తి సిమెంట్ ఇటుకలతో దాడి చేయగా బలమైన బలమైన గాయాలు అధిక రక్తస్రావం జరిగి మహేష్ అక్కడికక్కడే చనిపోయాడన్నారు. మీరు ఇక్కడే ఉంటే మహేష్ తరపు వారు దాడి చేస్తారని,పోలీసులు పట్టుకుంటారని నిందితులు అక్కడి నుండి పారిపోయారన్నారు. ఈ పత్రిక సమావేశంలో శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు,జైపూర్ ఎస్సై పాల్గొన్నారు.
https://swechadailynews.in/wp-content/uploads/2023/04/IMG-20230428-WA0001.jpg5761003adminhttp://swechadailynews.in/wp-content/uploads/2023/04/logo-1-1030x520.pngadmin2023-04-28 02:29:542023-04-28 02:30:03ఇందారం హత్య కేసు నిందితుల అరెస్టు
స్వేచ్ఛ న్యూస్, ఏప్రిల్ 27, రామగుండం: రామగుండం నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కోరారు. గురువారం హైదరాబాదులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ కలిసారు. రామగుండం నియోజకవర్గం లో వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించడంతో పాటు ఎల్కలపల్లి గుంటూరు పల్లి ప్రధాన రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. మంత్రి సానుకులంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
https://swechadailynews.in/wp-content/uploads/2023/04/IMG-20230427-WA0031.jpg10661599adminhttp://swechadailynews.in/wp-content/uploads/2023/04/logo-1-1030x520.pngadmin2023-04-27 14:54:002023-04-27 14:54:34రామగుండం రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించండి
స్వేచ్ఛ న్యూస్, ఏప్రిల్ 27, రామగుండం: హమాలీ కార్మికులన్యాయపరమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఈనెల 29 న హైదరాబాదులోని లేబర్ కమిషన్ ఆఫీస్ ముందు ధర్నా జరగనుం ది. సిఐటియు ఆధ్వర్యంలో మంథని అంబేడ్కర్ చౌరస్తాలో కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద. గణేష్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల వలె వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని 50 కిలోలకు మించిన బరువులు నిషేధించాలని ఐకెపి సొసైటీ హమాలీలకు ప్రభుత్వం బిల్లు చెల్లించాలని భద్రత గుర్తింపు కార్డులు కనీస వేతనాలు పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ వంటి చట్టబద్ధ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ గోదాం లో పనిచేస్తున్న హమాలీలను నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని హమాలీ కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని తదితర సమస్యల పరిష్కారం కోసం ఈనెల 29న హైదరాబాదులోని లేబర్ కమిషన్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో మంథని ప్రాంతం నుండి హమాలీలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్ల సందీప్ గొఱ్ఱంకల సురేష్ హమాలీ కార్మికులు రంగు శంకర్ శ్రీను రాజయ్య పుల్లయ్య మండల బాబు ఆడప నరసయ్య గుర్రాల సమ్మయ్య మొగిలి రమేష్ కొమురయ్య కట్టయ్య శీను తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ న్యూస్, ఏప్రిల్ 27, రామగుండం: అంతర్గాం మండలము ఐఎఫ్టియు ఆధ్వర్యంలో 138వ మే డే వాల్ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంఘ జిల్లా నాయకులు గుమ్మడి వెంకన్న పెండ్యాల రమేష్ తీగుట్ల రాములు, కట్ట తేజేశ్వర్ కొట్టే తిరుపతి లు మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం పని గంటలకు వ్యతిరేకంగా కార్మిక వర్గమంతా 138 సంవత్సరాల క్రితమే చికాగో పోరాటం ఫలితంగా ఎనిమిది గంటల పని దినాన్ని సాధించిన రోజు అనేక హక్కులను సాధించడం కోసం ఎంతోమంది కార్మిక నేతలు అమరులై తమ రక్తంతో తడిసిన ఎర్రజెండాను కార్మికుల పోరాటాల జెండాగా అందించిన మే డే దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం అంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపైన పోరాటం చేస్తూ మేడే నిర్వహించాలని పిలుపునిచ్చారు .కార్మికులకు కనీస వేతనాలు పని భద్రత 12 తగ్గింపు చేయాలని డిమాండ్ చేశారు నిజజీవితంలో సరిపడే వేతనాలు ఇవ్వడం లేదన్నారు స్థానికంగా ఉన్న ఎన్ టి పి సి ఆర్ఎఫ్సిఎల్ కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ సింగరేణిలో వందలాదిమంది కాంటాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు వారికి జీవో ప్రకారం వేతనాలు ఇవ్వడం లేదని అన్నారు ఎల్లంపల్లి పంప్ హౌస్లలో ప్రాజెక్టుల పైన పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సరిగా జీతాలు ఇవ్వడం లేదని అన్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు ఇవ్వకపోవడంతోకుటుంబాలను పోషించుకోలేకపోతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేనియెడల పెద్ద ఎత్తున పోరాటాల నిర్వహిస్తామని హెచ్చరించారు. అశోకు రాజేందర్ లు పాల్గొన్నారు.
https://swechadailynews.in/wp-content/uploads/2023/04/IMG-20230427-WA0029.jpg6321280adminhttp://swechadailynews.in/wp-content/uploads/2023/04/logo-1-1030x520.pngadmin2023-04-27 14:22:402023-04-27 14:55:49కార్మికుల హక్కుల సాధనకై పోరాడుదాం 138 వ మే డే ను ఘనంగా నిర్వహిద్దాం,