రామగుండం ప్రజలు సుభిక్షంగా ఉండాలని దర్గాలో, బీరప్ప గుడిలో ప్రార్ధనలు చేసిన చందర్
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 31: రామగుండం నియోజకవర్గంలోని ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో కలకాలం ఉండాలని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ బుధవారం రామగిరి మండలం బేగంపేట నవాబుపేట పీర్ పహాడ్ దర్గా బాబాకు పూల ప్రసాదాలతో పాటు చాదార్లు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 14వ డివిజన్లోని లక్ష్మీపురం బీరప్ప స్వామి వారి పట్నాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భగవంతుని నమ్ముకున్న వారికి అంతా మంచే జరుగుతుందని రామగుండం నియోజకవర్గ ప్రజల కోసం తాను నిరంతరం కృషి చేస్తున్నానని అందుకు ప్రజలకు,తనకు భగవంతుడు బీరప్ప,బాబా ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉంటాయని తాను 27 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామిమాల ధరించి ఆ భగవంతుని సన్నిధిలో గడుపుతున్నానని అన్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన ఈ కార్యక్రమలలో నాయకులు కెక్కెర్ల రాజ్ కుమార్,ఈదునూరి శ్రీకాంత్,ఇదునూరి కిరణ్ కుమార్,నారాయణ గౌడ్, విజయమ్మ ఫౌండేషన్ సభ్యులు సిద్ధార్థ,కార్పొరేటర్ నీల పద్మ గణేష్ తదితరులు పాల్గొన్నారు.