కెనడాలో ఘనంగా జరిగిన త్రిభాషామహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ 1250వ అష్టావధానం

స్వేచ్ఛ న్యూస్, కెనడా ప్రతినిధి, జూన్ 17: తెలుగువాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్,  తెలుగుతల్లి కెనడా ఆధ్వర్యంలో టొరంటోలో ఉన్న దుర్గా దేవి గుడిలో అష్టావధానం అత్యద్భుతంగా సాగింది. శరవేగంతో జరిగిన పూరణ లేఖకుల కలాలకి అందలేదు. చమత్కారమైన సంభాషణతో మొదలైన సభ, అప్రస్తుత ప్రసంగంతో ఇంకా చురుకై, ఆద్యంతమూ సభ్యులను నవ్వుల జల్లులులో ముంచెత్తింది.
చాలా సంవత్సరాల తరువాత అవధాన ప్రక్రియని వ్యక్తిగతంగా చూడడం ఎంతో ఆనందంగా ఉందని సీనియర్ సిటిజన్లు హర్షం వెలిబుచ్చగా, తెలుగులో ఇలాంటి ప్రక్రియ ఒకటి ఉందని తెలుసుకోవడం తమ అదృష్టమని యువత ఆనందం వ్యక్తం చేసారు. ఆ విధంగా అన్ని వయసుల వారిని ఉర్రూతలూగిస్తూ పద్మాకర్ గారు చేసిన అష్టావధానంతో తెలుగు సాహితీ కాంతులు కెనడాలో వెల్లివిరిసాయి.

గత రెండునెలలుగా బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మాకర్ గారు అమెరికా, కెనడా దేశాలలో చేస్తున్న ఆధ్యాత్మిక, సాహితీ పర్యటనలో భాగంగా అమెరికాలో వివిధ రాష్ట్రాలలో ప్రవచానాలు, ఒక అష్టావధానము, ఒక శతావధానము కూడా నిర్వహించి ఇప్పుడు కెనడాలో మరొక అష్టావధానం చేశారు. సమస్య, ఆశువు, వర్ణన, అప్రస్తుతప్రసంగం ఇలా అన్ని అంశాలతో సభను మరింత రక్తికట్టించిన పృచ్ఛకులను, తెలుగువాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మరియు తెలుగుతల్లి కెనడా సంస్థలను శ్రీ పద్మాకర్ గారు ప్రశంసించారు. అత్యంత వైభవంగా నిర్వహించబడిన ఈ సాహితీసదస్సు తెలుగు భాషాప్రియులకు కన్నులపండుగ అని పలువురు వారి అభిప్రాయం వ్యక్తం చేశారు.

తెలుగుతల్లి కెనడా వ్యవస్థాపకురాలు శ్రీమతి లక్ష్మి రాయవరపు గారు మాట్లాడుతూ ” ఏ దేశమేగినా ఎందు కాలిడినా చక్కటి తెలుగు మా ప్రాణ ప్రదం, తల్లి భూమి భారతిని గౌరవించడమే జాతికి నిండుతనం అన్న భావంతో తెలుగు తల్లి కెనడా నెలకొల్పబడింది. తెలుగుతల్లి పత్రిక కెనడాలో ఉన్న తెలుగు ప్రతిభనంతా ఒక చోటికి చేర్చే వేదిక” అని చెప్పారు.

తెలుగువాహిని అధ్యక్షులు శ్రీ త్రివిక్రం సింగరాజు గారు మాట్లాడుతూ ” శ్రీకృష్ణ దేవరాయల ఆముక్త మాల్యద చదవడం నించి, సభ్యులలో భావుకత పెంచే నేటి తరం వచన కవితలు వ్రాయించే దాకా పూచీ తెలుగువాహినిది” అని తెలియజేసారు.

ఓంటారియో తెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు శ్రీ మురళి పగిడేల గారు మాట్లాడుతూ ఓంటారియోలో ఉంటున్న తెలుగువారికి కావలసిన సహాయం చేసి, సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడడమే ఓటీ ఎఫ్ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.

Share this…

కూరగాయల అంగడి స్థల వివాదంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలి: సిఐ శివరాం రెడ్డి

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జూన్ 20: నార్కట్పల్లి పట్టణంలో మసీదు ఎదురుగా ఉన్న (కూరగాయల అంగడి) స్థలానికి సంబంధించిన వివాదానికి సంబంధించి మంగళవారం నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ శివరాం రెడ్డి, స్థానిక ఎస్సై సైదాబాబు ల ఆధ్వర్యంలో ఇరువర్గాలను కూర్చోబెట్టి సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ స్థల వివాదాలకు సంబంధించి ఎవరైనా చట్ట ప్రకారం అందుబాటులో ఉన్న డాక్యుమెంట్ల ఆధారంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని ఇరువర్గాలకు సూచించారు. ఈ వివాదంలో కోర్టు తీర్పులు సైతం ఉన్నాయని వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోట్ కూడా ఉన్నందున సంబంధిత ఆధారాలను పరిశీలించనున్నట్టు పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ వివాదం కొనసాగుతున్నందున దీనికి కలెక్టర్ స్థాయిలో పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నదని ఇరువర్గాలు సమర్పించిన డాక్యుమెంట్లను పరిశీలించి పై అధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు. రెండు వర్గాల వారికి సంబంధించిన పెద్ద మనుషులు, స్థానిక అధికారుల సమక్షంలో ఇరువురికి నచ్చజెప్పి పంపించారు. ఈ విషయంపై ఎవరు కూడా ఎలాంటి ఆరోపణలు కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కానీ పాల్పడినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

Share this…

అర్హులకే దళిత బంధు ఇవ్వాలి: దినేష్

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జూన్16: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలను లక్ష్యాలకు విరుద్ధంగా అధికార పార్టీ కార్యకర్తలకు పళ్లెంలో పలహారంగా పంచుతూ ఎమ్మెల్యేలు అర్హులకు అన్యాయం చేస్తున్నారని డి హెచ్ పి ఎస్ పెద్దపల్లి జిల్లా సమితి నాయకులు విమర్శించారు. శుక్రవారం వరంగల్ నగరంలోని ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో దళిత హక్కు పోరాట సమితి రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు డి హెచ్ పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూరి రాజరత్నం సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ ఉపాధ్యక్షులు ఎర్రాల రాజయ్య,కోడెం స్వామి,కే.సదానందంలు శిక్షణ తరగతులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజరత్నం,మధ్ధెల దినేష్ లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ్యులకు పథకాల ఎంపిక బాధ్యతలను అప్పగించి అర్హులకు అన్యాయం చేస్తూ అధికార పార్టీ అనుచరులకు వరంగా అందిస్తుందన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆరే అధికార పార్టీ శాసనసభ్యులు పర్సంటేజీలు తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మారని పరిస్థితులు దాకరించాయని పేర్కొన్నారు. దళిత బంధు ఇప్పటికే నియోజకవర్గానికి 100 చొప్పున ఇచ్చిన ఊరికో కోడి ఇంటికో ఈక లాగా ఉందని ఎద్దేవా చేశారు. దళిత బంధు ప్రభుత్వ పథకమా?రాజకీయ పథకమా? అని ప్రశ్నించారు. శాసనసభ్యులు మంత్రుల జోక్యం లేకుండానే కలెక్టర్ల ద్వారానే ఎంపిక చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం నియోజకవర్గానికి 1500 చొప్పున కేటాయించినవి కలెక్టర్లకు అధికారం ఇచ్చి గ్రామసభలు,పట్టణ సభలు,డివిజన్ సభల ద్వారా ఎంపిక చేయాలని కోరారు. దళితులకు మూడెకరాల భూమి,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో తిరని అన్యాయం జరిగిందన్నారు. కెసిఆర్ పాలనలో దళితులకు అడుగడుగున అన్యాయమే జరుగుతుందని దళితుల బడ్జెట్ ధనవంతులకు ఖర్చు చేస్తుందన్నారు. దళిత బందు పథకం అర్హులైన వారికే అందజేయాలని ప్రశ్నించిన వారి ఇండ్లపై దుర్మార్గమైన ప్రజాప్రతినిధులు దాడులు చేయిస్తూ,అక్రమ కేసులు పెట్టి వేధించడం వారి నియంత పాలనకు నిదర్శనం అని పేర్కొన్నారు. ప్రభుత్వం దళిత బంధు పారదర్శకంగా అమలు చేయకపోతే ప్రగతి భవన్ వరకు దండయాత్ర చేపడతామని మధ్ధెల దినేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Share this…

గుర్తుతెలియని వ్యక్తి మృతి

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జూన్6: కాంపల్లి గంగయ్య అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు 27.4.2023 నాడు బెల్లంపల్లి కెమికల్ ఫ్యాక్టరీ దగ్గరలో ఒక గుర్తు తెలియని వ్యక్తి స్పృహ లేని పరిస్థితిలో కింద పడి ఉండటంతో 108 కి ఫోన్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు. ఈనెల 3.6.2023 రోజున అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా అతని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడని అనుకున్నాడు. కానీ మంగళవారం ఉదయం అనగా 6.6.2023 నాడు అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మృతి చెందాడని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు తెలపడంతో ఈ విషయాన్ని గంగయ్య బెల్లంపల్లి 2 టౌన్ స్టేషన్ కు సమాచారం అందించాడు. మృతుని వయసు సుమారు 50 నుండి 55 మధ్యవయసు కలిగి ఉండవచ్చని బట్టతల కలిగి ఉన్నాడు నల్ల పాయింటు ధరించి ఉన్నాడు. ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కుసమాచారం అందించగలరని ఎస్ ఐ రవికుమార్ తెలిపారు.

Share this…

ధరణి ఆపరేటర్ల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు

స్వేచ్ఛ న్యూస్, హైదరాబాద్, జూన్ 4: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం తెలంగాణ భవన్ లో ధరణి ఉద్యోగుల నూతన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యవర్గంలో సంగం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గా బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి రూప్ సింగ్ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా TSTS ఛైర్మెన్ జగన్ రావు, BDL ఎంప్లాయిస్ ఛైర్మెన్ దానకర్ణ చారీలు హాజరయ్యారు. నూతన కార్యవర్గంలో నల్లగొండ కు చెందిన దండంపల్లి అశోక్ ని అద్యక్షులు గా, సాయిబాబా ని ఉపాధ్యక్షులుగా, ఎం అనిత ని ప్రధాన కార్యదర్శి గా, జి హిమేష్ కుమార్ ని కోశాధికారిగా, గౌరవ సలహాదారు గా CH.శ్రీధర్ ను ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి DC లు, FTS లు అన్ని జిల్లాల వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధరణి ఉద్యోగుల సమస్యలైన కనీస వేతనం, నెలనెలా జీతం, ఉద్యోగ భద్రత తదితర అంశాలపై చర్చించి ఇట్టి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారం దిశ గా కృషి చేయనున్నట్లు తెలిపారు.

Share this…