ఒక అవకాశం ఇవ్వాలని ఎల్ఐసి ఏజెంట్లను కోరిన రాజ్ ఠాకూర్

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 31: మంగళవారం గోదావరిఖని ఎల్ఐసి కార్యాలయంలో ఎల్ఐసి ఏజెంట్లను కలిసి ఒక అవకాశం ఇవ్వాలని కోరిన కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ అభ్యర్థి మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో,కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎక్కిన వెంటనే ఆదాని అంబానీలకు కట్టబెట్టిన ఎల్ఐసిని ప్రైవేట్ పరం కానీయబోమని ఈ ప్రాంత బిడ్డగా పోరాటం చేస్తున్న నాకు చేతి గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,ఇతరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share this…

ప్రచారంలో దూసుకుపోతున్న గొర్రె రమేష్

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 31: రామగుండం నియోజకవర్గం నుండి తెలంగాణ లేబర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ న్యాయవాది గొర్రె రమేష్ రెండవ విడత శంఖారావ ప్రచారంలో తనను గెలిపించాలని విట్టల్ నగర్ చౌరస్తా,వీర్లపల్లి,సెవన్ ఎల్ బి కాలనీలోని అత్యంత పేద ప్రజలు నివసించే ప్రాంతాలలో ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది.ఈ సందర్భంగా గొర్రె రమేష్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో పార్టీల,వ్యక్తుల,హోదాల పేర్లతో ఓట్లు అడుగుతూ ప్రజలను మోసం చేస్తున్నారు.5 ఏళ్లు అధికారంలో ఉన్న కోరికంటి చందర్ గాని ఒక్కసారి చైర్మన్గా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న సోమవారం సత్యనారాయణ గాని మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయిన మక్కాన్సింగ్ కానీ ఈ ప్రాంత ప్రజలకు ఏమీ చేయలేదని అన్నారు. సెవెన్ ఎల్ బి కాలనీవాసులందరినీ దత్తత తీసుకొని డబ్బులు,పదవులు,అభివృద్ధి ఆశ చూపుతూ మోసం చేస్తున్నటువంటి నాయకులను ఓడించి నన్ను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ శంకరావ ప్రచార కార్యక్రమంలో అల్లెపు తిరుపతి,కన్నం భానుచందర్,చెరుకు పైడి అఖిల్ వర్మ,జక్కం కవిత,పొన్నం రజిత శలిగంటి ఓదెలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share this…

చనిపోయిన ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక భరోసానే లక్ష్యంగా కుటుంబ భరోసా పథకం

స్వేచ్ఛ న్యూస్, అక్టోబర్ 31, నల్గొండ: ప్రతినిత్యం కాలంతో ప్రయాణిస్తూ కుటుంబాన్ని గడుపుతున్న ఫోటోగ్రాఫర్ అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదంలో గాని మరే ఇతర కారణం చేతనైన మరణించినట్లయితే ఆ ఫోటోగ్రాఫర్ కుటుంబం ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడొద్దు అనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిందే ఫోటోగ్రఫీ కుటుంబ భరోసా పథకం అని ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ పేర్కొన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పట్టణ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ కుటుంబ భరోసా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన రాష్ట్ర కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్, రాష్ట్ర గౌరవ సలహాదారు పున్న రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు శ్రీమన్నారాయణ లతో కలిసి నార్కెట్పల్లి కి చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ యాళ్ల మల్లేశం, నల్లగొండకు చెందిన ఫోటోగ్రాఫర్ నూకల శంకర్ కుటుంబాలకు 1 లక్ష 55 వేల రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు హుస్సేన్ మాట్లాడుతూ దినదిన గండం ప్రవర్థమానంగా కుటుంబాలను నెట్టుకొస్తున్న ఫోటోగ్రాఫర్ లు ఇటీవల మారిన జీవనశైలి కారణంగా హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్, లేదా రోడ్డు ప్రమాదాలు తదితర కారణాల చేత మృతి చెందుతున్నారని అలా మృతి చెందిన ఫోటోగ్రాఫర్ల కుటుంబాలు ఆర్థికంగా చితికి పోకుండా కాపాడటమే లక్ష్యంగా గత 2 సంవత్సరాల క్రితం మనకోసం మనం అనే నినాదంతో ఏర్పాటు చేసుకున్న ఫోటోగ్రఫీ కుటుంబ భరోసా పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన 76 మంది ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు సుమారు 1 కోటి రూపాయల ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. 2 సంవత్సరాల వ్యవధిలో ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందజేయడం రాష్ట్ర, దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ సంఘం ద్వారా కూడా సాధ్యం కాలేదని తెలిపారు. ఒక్కొక్క ఫోటోగ్రాఫర్ కేవలం 10 రూపాయల కంట్రిబ్యూషన్ తో ఈ సహాయం అందజేయడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఇట్టి కార్యక్రమం విజయవంతం అవ్వడానికి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా సంఘాలు, మండల సంఘాలు, సభ్యత్వం ఉన్న ప్రతి ఫోటోగ్రాఫర్ కృషి వెలకట్టలేనిదని ఫోటోగ్రాఫర్ల సహకారాన్ని అభినందించారు. అతి త్వరలో ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు అధిక మొత్తంలో లబ్ధి చేకూరే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అసోసియేషన్ కోశాధికారి పున్న విజయలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు గుమ్మడవెల్లి శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి పసుపులేటి కృష్ణ, పట్టణ అధ్యక్షులు పుట్ట మోహన్ రెడ్డి, కుటుంబ భరోసా జిల్లా ఇన్చార్జి సుమన్, నార్కెట్పల్లి అధ్యక్షులు కన్నెబోయిన నరసింహ, ప్రధాన కార్యదర్శి గౌరీదేవి నరసింహ, కోశాధికారి నీలం శివరాం, నాయకులు సోమ వెంకటరెడ్డి, మనోహర్, వేణుమాధవ్, లక్ష్మణ్, అనురాధ, శోభ వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share this…

అసెంబ్లీ ఎన్నికల్లో మహిళకు అవకాశం ఇవ్వండి సంధ్యారాణి

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 30: 2ఇంక్లైన్ కార్మికులను కలిసిన బిజెపి అభ్యర్థి సంధ్యారాణి ప్రతి కార్మికుడిని పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గం నుండి ఎంతోమంది నాయకులకు అవకాశం కల్పించారని ఈసారి ఒక మహిళకు అవకాశం కల్పించండని కోరారు.నా వెనక వీలకోట్ల ఆస్తులు లేవని లీడర్లు అంతకన్నా లేరని నా బలం బలగం అంతా మీరేనని అన్నారు.భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని ఈ ఎన్నికల్లో వారు చేసినవి ఎక్కడ బయటపడతాయో అని గనుల వద్ద ప్రచారం నిర్వహించకుండా కార్మికులను బెదిరింపులకు గురిచేసే పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. సింగరేణిలో కార్మికులను కలవకుండా బయట మాత్రమే కలవాలని ఆ ప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.మీ ఇంటి ఆడబిడ్డగా ఒక మహిళగా అడుగుతున్నానని బిజెపికి ఓటు వేసి నన్ను గెలిపిస్తే నీతివంతమైన పాలన అందిస్తానని సంధ్యారాణి అన్నారు.ఈ కార్యక్రమంలో బిఎంఎస్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య వైస్ ప్రెసిడెంట్ ఆకుల హరీష్ కార్యదర్శి సాయి వేణి సతీష్ కేంద్ర ఉపాధ్యక్షులు సారంగపాణి కేంద్ర కార్యదర్శి మాదాసు రవీందర్2 ఇంక్లైన్ సెక్రటరీ పెంచల వెంకటస్వామి కార్మికులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this…

తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్న సత్యనారాయణ

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 30: స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన సోమారపు సత్యనారాయణ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నా క్రమంలో మాజీ కార్పొరేటర్ రవి నాయక్ సోమారపు గుడికి చేరారు.రామగుండం అభివృద్ధి చెందాలంటే నీతివంతమైన పాలన కావాలని అది కేవలం సత్యనారాయణకే సాధ్యమని తనకు మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. టిఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులకు దీటుగా ప్రచారం నిర్వహిస్తూ ఈరోజు 8 ఇంక్లైన్ కాలనీలోని రాజీవ్ నగర్,లంబాడి తండా,తారక రామారావు నగర్, భాస్కర్ రావు నగర్ లో జరిగిన ప్రచారంలో ఆయనకు అడుగడుగున ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నానని 8 ఇంక్లైన్ కాలనీ ప్రజలతో తనకు మంచి అవినావ సంబంధం ఉందని ఇక్కడ అభివృద్ధికి సింగరేణి తో మాట్లాడి అనేక రకాలైన అభివృద్ధి పనులు చేపట్టానని ఇప్పుడు మళ్లీ ఎలక్షన్లు వచ్చాయని తెలిపారు.పాపమని ఒకసారి అవకాశం ఇచ్చినందుకు ఐదు సంవత్సరాలు బాధపడ్డామని అవినీతి,భూకబ్జాలు,బెదిరింపులకు పాల్పడుతూ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశారని అన్నారు.ఇప్పుడు కొత్తగా ఇంకొక వ్యక్తి ఒక ఛాన్స్ అంటూ ఎలక్షన్లో ఓట్లు పడేయడానికి వస్తున్నాడు అతని గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండకుండా వెళ్లి హైదరాబాదులో ఉంటాడని కాబట్టి అలాంటి నాయకులకు బుద్ధి చెప్పి నాకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే రామగుండం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో సోమారపు అరుణ్-లావణ్య, జాలి రాజమణి, కుసుమ, రవి నాయక్, కృష్ణ, ప్రవీణ్, బిక్షపతి, వీరన్న, సురేష్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Share this…

మానవత్వం చాటుకున్న నార్కెట్పల్లి వాసి

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, అక్టోబర్ 14: తనకు దొరికిన సెల్ ఫోన్ ను పోగొట్టుకున్న వ్యక్తికి అందజేసి మానవత్వం చాటుకున్న సంఘటన శనివారం నార్కెట్పల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నార్కట్పల్లికి చెందిన నీలం వీరయ్య సాయంత్రం మార్కెట్కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో రోడ్డుమీద మొబైల్ ఫోన్ దొరికింది. వెంటనే వీరయ్య తనకు దొరికిన ఫోను ను పోలీస్ స్టేషన్లో అప్ప చెప్పేందుకు వెళ్లగా ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు పోతినేనిపల్లి గ్రామానికి చెందిన ఆదిమల్ల ప్రవీణ్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేందుకు వెళ్లి అక్కడే ఉన్నాడు అది గమనించిన వీరయ్య పోలీసుల సమక్షంలో బాధితునికి మొబైల్ ఫోన్ ను అప్పజెప్పాడు నిజాయితీగా ఫోన్ తెచ్చి ఇచ్చిన వీరయ్యను పోలీసులు అభినందించారు.

Share this…

వ్యాపారుల సంక్షేమానికి కృషి చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తికి వినతి


స్వేచ్చ న్యూస్, నార్కట్ పల్లి, అక్టోబర్ 14
నార్కట్ పల్లి పట్టణంలో ఉన్న వ్యాపారుల సంక్షేమానికి కృషి, చేస్తూ ఇతర రాష్ట్రాల వ్యాపారులకు నార్కట్ పల్లి పట్టణంలో అనుమతులు ఇవ్వొద్దని కోరుతూ నార్కట్ పల్లి పట్టణ వ్యాపారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నకరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షులు బోడ వెంకన్న మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి నార్కట్ పల్లి పట్టణంలోకి వలస వచ్చి ఇక్కడి ప్రజలను మోసం చేయడానికి, ప్రస్తుత వ్యాపారాలను దెబ్బతీసే విధంగా అత్యధిక అద్దె చెల్లిస్తామని యజమానులకు నమ్మబలికి నాసిరకం వస్తువులను అందుబాటులోకి తెచ్చి, తక్కువ ధరకు ఇస్తామంటూ వినియోగదారులను మోసం చేస్తున్నారన్నారు. మార్వాడి వ్యాపారస్తులకు పట్టణంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతులు ఇవ్వద్దని పట్టణంలో ఉన్న అందరు వ్యాపారస్తులు ఏకగ్రీవ తీర్మానము చేసినట్లు పేర్కొన్నారు. కావున ఇట్టి తీర్మానానికి బలం చేకూరుస్తూ పట్టణంలో ఇతర రాష్ట్రాల వారికి అనుమతులు ఇవ్వవద్దని కోరారు.
ఈ కార్యక్రమంలో వ్యాపార అసోసియేషన్ గౌరవ సలహాదారులు నల్లగొండ నాగరాజు, ఉపాధ్యక్షులు కొప్పు అంజన్, ప్రధాన కార్యదర్శి బోయపల్లి శ్రవణ్, కోశాధికారి కనకారావు, పసునూరిశివరాం, పల్లెర్ల నాగరాజు, సహాయ కార్యదర్శి రమేష్ రెడ్డి, కన్నెబోయిన లింగస్వామి, చొల్లేటి శ్రీనివాస్ చారి, నల్లగొండ రాంబాబు, కానుకుర్తి శ్రీనివాస్, గుంటోజు రమేష్ చారి, బొల్లం సంతోష్, సహాయ కార్యదర్శి అందోజు మహేంద్ర చారి , పల్లెర్ల సత్యనారాయణ, షణ్ముఖ చారి, తండ వెంకన్న, బుచ్చిరెడ్డి, అర్థం శ్రీనివాస్, వీర కుమార్, బెల్లీ దశరథ, కానుకుర్తి సత్యనారాయణ, శంకరాచారి, రామాచారి, తడక మల్ల ప్రసాద్, లీగల్ అడ్వైజర్లు గర్దాస్ వెంకటేశ్వర్లు, అద్దంకి శ్రీశైలం చారి, తదితరులు పాల్గొన్నారు.

Share this…

ఆరోగ్యం కోసం పరిసరాల పరిశుభ్రత అవసరం


నార్కట్ పల్లి, అక్టోబర్ 1, స్వేచ్ఛ న్యూస్:
ప్రతి ఒక్కరికి వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రత వల్ల వ్యాధులకు దూరంగా ఉండవచ్చని కామినేని వైద్య, విద్యా కళాశాల వైస్ ప్రిన్సిపల్ పి సుధీర్ బాబు పేర్కొన్నారు. మండల పరిధిలోని చెరువుగట్టులో గల శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో, ప్రాథమిక పాఠశాల ఆవరణ లో, ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆ కళాశాల వైద్య విద్యార్థులచే శ్రమదానం నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోనే ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్య విద్యార్థులు గ్రామ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరమూ ఆరోగ్యం కోరుకుంటాం కానీ తమ వ్యక్తిగత పరిశుభ్రత తోనే సరిపెట్టుకుంటారు. పరిసర ప్రాంత అపరిశుభ్రత వల్ల సమాజంలో చెడు రుగ్మతలు పెరిగి ప్రతి ఒక్కరూ వ్యాధిగ్రస్తులుగా మారాల్సిన పరిస్థితి ఉంటుందనీ. ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకొని. తాను ఉండే ప్రాంతంలోనే తమ ఇంటితోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమలకు, ఇతర క్రిమి కీటకాలకు దూరంగా ఉండవచ్చని తద్వారా ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని సూచించారు. ఈ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్గా బాలకృష్ణ ,శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు రామలింగేశ్వర శర్మ, ప్రొఫెసర్ డాక్టర్ బాలరాజు, కళాశాల సిబ్బంది ఓం ప్రకాష్, గోపాల్, నరేష్, దేవస్థాన సిబ్బంది శంకర్, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share this…