పాపమని గెలిపిస్తే పది తరాలకు తరగని ఆస్తులను సంపాదిస్తారు
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, నవంబర్ 9: రామగుండం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సోమారపు సత్యనారాయణ ఈరోజు ఉదయం 28, 41 డివిజన్ల మండల అధ్యక్షుడు జనగామ రాజాలింగు,పిట్టల కొమురయ్య,రాధా,బూడిద రవి,సునీల్,రాకేష్ అధ్యక్షతన విద్యానగర్,లెనిన్ నగర్,హనుమాన్ నగర్,గాంధీనగర్లలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి మీ ఆశీర్వాదం కోసం మళ్లీ మీ ముందుకు వస్తున్నానని రామగుండం ప్రజలు చాలా చైతన్యవంతులు ఇక్కడున్నటువంటి సింగరేణి కార్మికులు,సంఘటిత అసంఘటిత కార్మికులు,కర్షకులు, విద్యావేత్తలు,విద్యార్థులు,యువకులు,మేధావులు,వ్యాపారులు అందరూ నాకు మద్దతు తెలిపారని పేర్కొన్నారు.ఇప్పుడు కూడా మీ అందరి ఆదరణ ప్రేమతో రామగుండం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలవబోతున్నానని గతంలో నేను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని చూసి నన్ను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు.కానీ గత ఎలక్షన్లలో పాపమని ఓటు వేసినందుకు పది తరాలకు తరగని ఆస్తులను సంపాదించుకుని తన స్వలాభం కోసం తప్ప నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసాడన్నారు.కొత్తగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారానికి వస్తున్నాడు అతనికి ఓటు వేస్తే వెళ్లి హైదరాబాదులో ఉంటాడు కనీసం ప్రజలకు అందుబాటులో ఉండడు అందుకోసం ప్రజలు ఎవరికి ఓటు వేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటాడో ఎవరికి ఓటు వేస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందో ఆలోచించి ఓటు వేసి గెలిపించాలని కోరారు. సోమారపు లావణ్య అరుణ్ కుమార్,మాజీ మీర్ జాలి రాజమణి,కుసుమ,మాజీ కార్పొరేటర్లు పిడుగు కృష్ణ,కోదాటి ప్రవీణ్,వడ్లూరి రవి,రవి నాయక్,మామిడాల చంద్రయ్య, రాజేష్,ప్రకాష్,బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!