రావుస్ విద్యా సంస్థ పై చర్య తీసుకోవాలని విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఏప్రిల్ 29: గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని సప్తగిరి కాలనీలో 2020 సంవత్సరంలో హైదరాబాదుకు చెందిన రావుస్ విద్యా సంస్థల యజమాన్యం ఇక్కడ ఒక బ్రాంచ్ ని స్థాపించి అందులో సి బి ఎస్ ఈ సిలబస్ ఉందని హంగు ఆర్పాటలతో రంగురంగుల కరపత్రాలను ముద్రించి,వివిధ రకాల డిజైన్ ఫ్లెక్సీలను ముద్రించి ప్రచారం చేసి ఇక్కడి పారిశ్రామిక ప్రాంత విద్యార్థులను వారి తల్లిదండ్రులను నమ్మించి మోసం చేసి అబద్ధపు ప్రచారాలతో విద్యార్థులను చేర్పించుకున్నా రావుస్ విద్యా సంస్థపై చర్య తీసుకోవాలని విద్యాశాఖ మంత్రికి,విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని సిపిఐ నగర కార్యదర్శి కే.కనకరాజ్, సహాయక కార్యదర్శి మద్దెల దినేష్ లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంస్థలో సిబిఎస్ఇ సిలబస్ ను బోధించేందుకు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేవని విద్యార్థులను వారి తల్లిదండ్రులను,ఈ ప్రాంత ప్రజలందరిని మోసం చేశారని విద్యాశాఖ మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నామన్నారు. ఈ రావుస్ విద్యా సంస్థలు ఇచ్చే ముడుపులకు ఆశపడి స్థానిక ఎం.ఈ.ఓ, సంబంధిత విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేసిన పాపాన పోలేదని ఏదైనా సమస్య ఉంటే స్థానిక విద్యా శాఖ అదికారులకు ఫోన్ చేస్తే ఎత్తే పరిస్థితి ఉండదని విచారణ చేసి ఆలోచన కూడా వారికి ఉండదని ప్రభుత్వ ఇచ్చే లక్షలాది రూపాయల వేతనం పొందుతూ విద్యాసంస్థ ఇచ్చే ముడుపులకు ఆశపడి విద్యార్థుల భవిష్యత్తును కాపాడే ప్రయత్నం చేయరని మీ దృష్టికి తీసుకురావడం జరిగిందని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే రావుస్ విద్యాసంస్థ గుర్తింపును రద్దుచేసి పాఠశాలను సీజ్ చేయాలని కమ్యూనిస్టు పార్టీ తరపున కోరుతున్నామని ఆయన మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నామని సిపిఐ నగర సహాయక కార్యదర్శి మద్దెల దినేష్ ఇచ్చిన ప్రకటనలో పెర్కోన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!