రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన రాజ్ ఠాకుర్

రామగుండం, పెద్దపల్లి జిల్లా, ఎప్రిల్ 22, స్వేచ్ఛ న్యూస్: రంజాన్ పండుగ సందర్భంగా శనివారం పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ శారద నగర్ అహ్లె హదిస్ ఈద్గా, ఫోర్ ఇంక్లైన్ ఈద్గా, రామగుండంలో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొని నమాజ్ చేశారు. అనంతరం మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు వారి కుటుంబ సభ్యులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహ్రుధ్భావానికి, కరుణకు,దాతృత్వానికి,సర్వ మానవ సమానత్వానికి ప్రతీక అన్నారు. అల్లహ దీవెనలతో ప్రజలకు సకల శుభాలు కలగాలని వేడుకున్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన కలయికే రంజాన్ మాసం విశిష్టత దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ముగింపు వేడుకని పేర్కొన్నారు. క్రమశిక్షణ, ఐకమత్యంతో మెలగటం పేదలకు సహాయం చేయడం ఈ రంజాన్ మనవాళ్ళకి ఇచ్చే సందేశం అన్నారు. మనిషిలోని చెడు భావనలను అధర్మాన్ని ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ అని పేర్కొన్నారు. ఫైవ్ ఇంక్లైన్ కబరస్తాన్ చుట్టూ సింగరేణి సంస్థ పరహరి గోడ నిర్మించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.రామగుండం కార్పొరేషన్ ఎన్నికలలో ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ ఎనిమిది మంది మైనార్టీలకు కార్పొరేట్ టికెట్లు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

0 replies

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *