తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తున్నాం: పల్లగొర్ల మోదీరాందేవ్
స్వేచ్ఛ న్యూస్, ఏప్రిల్ 25, హైదరాబాద్: ప్రజాగొంతుక తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని తన ఇంటి వద్ద మంగళవారం మల్లన్న ను సన్మానించిన బీసీ విద్యార్థి రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ q న్యూస్ ద్వారా అనేక విషయాలు వెలుగులోకి తెస్తూ జనాలను సంఘటితం చేస్తున్న తీన్మార్ మల్లన్న పై కేసులు పెట్టి వేధించడం సరికాదన్నారు. దీనిని బీసీ విద్యార్థి సంఘం ఖండిస్తుందనీ తెలంగాణలో ప్రశ్నించడం అంటే ఆఫ్టనిస్తాను కన్నా అధ్వానంగా మారిందనీ బహుజనవాదం ముందుకు పోవాలంటే పేద ప్రజలకు న్యాయం జరగాలంటే మల్లన్న పార్టీ పెట్టాలన్నారు. సమావేశంలో బీసీ స్టూడెంట్ వింగ్ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ మణికంఠ గౌడ్, బిజెపి మేడ్చల్ కార్యవర్గ సభ్యుడు చంద్రశేఖర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!