ఫైవ్ ఇంక్లైన్ పట్టణ కమిటీ అధ్యక్షుడిగా కనుకుంట్ల శ్రీనివాస్ నియామకం
స్వేచ్చ న్యూస్, రామగుండం, మే 18: యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ ఫైవ్ ఇంక్లైన్ పట్టణ కమిటీ అధ్యక్షులుగా కూకట్ల శ్రీనివాస్ యాదవ్ ను కార్పొరేషన్ అధ్యక్షులు సతీష్ నియమించారు.వారి నియామక పత్రాన్ని పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కూకట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఫైవ్ ఇంక్లైన్ పట్టణ కమిటీలోని ఐదు డివిజన్ల లో యువజన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని రానున్న రోజుల్లో రామగుండం నియోజకవర్గంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ను రామగుండం శాసనసభ్యునిగా గెలిపించడానికి కృషి చేస్తానన్నారు.ఈ నియామకానికి కృషి చేసిన చుక్కల శ్రీనివాస్,పాతిపల్లి రవి యాదవ్ గార్లకు ధన్యవాదాలు తెలిపారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!