ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి వ్యక్తి దుర్మరణం
స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, మే 12: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి మృతి చెందిన సంఘటన నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామ పరిసరాలలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుర్రంపోడు మండలం చేపూరు గ్రామానికి చెందిన కొమ్ము సహదేవ్ (33) నార్కెట్పల్లి మండల కేంద్రంలోని రిలయన్స్ స్మార్ట్ కేంద్రంలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడంతో మనస్థాపానికి గురై శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చెరువుగట్టు ఆర్చ్ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం 108 ద్వారా స్థానిక కామినేని హాస్పిటల్ లో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతునికి భార్య, 4 సంవత్సరాల కుమారుడు, ఒకటిన్నర సంవత్సరాల కూతురు ఉన్నారు. మృతుని అన్న సుధాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నార్కెట్పల్లి ఎస్సై సైదా బాబు తెలిపారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!