ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 30: అంతర్గాం మండల పరిధిలోని గోలివాడ ఐకెపి కేంద్రాన్ని మంగళవారం రోజున రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ పరిశీలించి అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకలితీర్చే అన్నదాతగా పేరుగాంచిన రైతన్నలకు సీఎం కేసీఆర్ సంక్షేమ ప్రణాళికను రూపొందించి అకడ్బందీగా అమలు చేస్తూ అండగా నిలుస్తారన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందని రైతులు పండించిన ప్రతి వరిగింజను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతే రాజుగా పాలనసాగిస్తూ కెసిఆర్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో రైస్ మిల్లర్లు ఎటువంటి కోత లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. ఋతుపవనాలు రానుండడంతో అధికారులు ధాన్యం తరలింపులో ఎటువంటి అలసత్వం వహించకూడదని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ధరణి రాజేష్,బాధరవేణి స్వామి, బండారి ప్రవీణ్ కో ఆప్షన్ మెంబర్ గౌస్ పాషా మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి నాయక్ నాయకులు కోల సతీష్ గౌడ్,నూకరాజు తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!