వీరాంజనేయ హమాలీ సంఘం కార్యాలయంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు
రామగుండం, జులై 24: గోదావరిఖని లక్ష్మీనగర్ రీగల్ షూమార్ట్ వద్ద గల వీరాంజనేయ హమాలీ సంఘం కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాతపల్లి ఎల్లయ్య ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గ శాసనసభ్య ఆశావాహులు మిరియాల రాజిరెడ్డి,కందుల సంధ్యారాణి,పాతపల్లి ఎల్లయ్య,కొంకటి లక్ష్మీనారాయణ, బయ్యపు మనోహర్ రెడ్డి పాల్గొని సంఘటిత అసంఘటిత కార్మికుల మధ్యలో కేటీఆర్ జన్మదిన కేకును వారి చేతిలో మీదుగా కట్ చేయించి స్వీట్లు పంపిణీ చేశారు. కేటీఆర్ భారత దేశంలోనే మన రాష్ట్రాన్ని ఐటి రంగంలో మొదటి స్థానంలో ఉంచడం కోసం,నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం నిరంతరం కృషి చేస్తూన్నా మన కల్వకుంట్ల తారక రామారావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత యువత ఉద్యోగల కోసం తల్లడిల్లుతుంటే వారికి అవకాశాన్ని కలిగించేందుకు దేశ విదేశాలు తిరుగి ఇండస్ట్రీస్,ఐటీ పార్క్ తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదును దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తుంది మన రామన్న అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వీరాంజనేయ హమాలీ సంఘం నాయకులు కొమ్ము కుమారస్వామి,వడ్డేపల్లి మహేందర్,పున్నం కిషన్,తన్నూర్ శ్రీనివాస్,మల్లతుత్తుల లక్ష్మణ్,బలిగే రమేష్,ఉష్కే రవి హమాలీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!