రామగుండం రూరల్ ఏప్రిల్ 26_2023 స్వేచ్ఛ న్యూస్ ఆద్యాత్మిక చింతన, భక్తి భావం మానవాళీని సన్మార్గంలొ నడిపిస్తుందని రామగుండం ఎమ్మేల్యే కోరుకంటి చందర్ గారు అన్నారు. బుధవారం సింగరేణి గోదావరి గెస్ట్ హౌజ్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు. ప్రతి వ్యక్తి సన్మార్గంలో పయనించే విధంగా బైబిల్లో వాక్యాలు పొందుపరిచి ఉన్నాయని అన్నారు. ఎదుటివారి పట్ల ఏ విధంగా నడుచుకోవాలో బైబిల్ గ్రంధంలో పొందుపరిచి ఉన్నాయని అన్నారు. అనంతరం విడనాడి జింబాబ్వే దేశం నుంచి ఇక్కడి క్రైస్తవ సంఘాల సందర్శన కోసం వచ్చిన జింబాబ్వే క్రైస్తవ మత బోదకులు జీఫొ గడిజీకాను ఎమ్మెల్యే చందర్ గారు సత్కరించారు. ఈ కార్యక్రమంలొ స్థానిక క్రైస్తవ పాస్టర్ సంఘ నాయకుడు పాస్టర్ థిమెతీ పాల్, పలు పక్షాల బాధ్యులు దయానంద్ గాంధీ, నారాయణ దాస్ మారుతి, సాగంటి శంకర్, దాతు శ్రీనివాస్, చెరుకు బుచ్చి రెడ్డి తదితరులు ఉన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!