అసెంబ్లీలో సింగరేణి,ఎన్టీపీసీ లోని పలు అంశాలపై మాట్లాడిన చందర్
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 5: రామగుండం శాసనసభ్యులు కోరు కంటి చందర్ శనివారం అసెంబ్లీ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.బొగ్గు బ్లాక్లను సింగరేణికే కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ హయాంలో సింగరేణి సంస్థలో జరిగిన అవినీతితో బిజెపి కేంద్ర ప్రభుత్వం ఎంఎంటిఆర్ యాక్ట్ 2015ను తీసుకువచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఈ యాక్ట్ తో తెలంగాణ రాష్ట్రంలోని వనరులన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్రంలో లిగ్నమెంట్ మైంన్స్ అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని వనరులన్నీ సింగరేణి సంస్థకు,రాష్ట్ర ప్రభుత్వానికి వర్తించేలా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.2018లో ఆయన శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత ఎన్టిపిసి కాంట్రాక్ట్ కార్మికులకు అగ్రిమెంట్ చేయడం జరిగిందని కానీ నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు చేసిన అగ్రిమెంట్ను ఎన్టిపిసి యజమాన్యం కార్మికులకు వర్తింపచేయలేదన్నారు.ఎన్టిపిసి కాంట్రాక్ట్ కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాలు అమలు కావడంలేదని మెడికల్ బోర్డు విషయంలో ఇబ్బందులు పెడుతున్నారని ఆర్.ఎల్.సి సూచనలను ఎన్టిపిసి యజమాన్యం పాటించడం లేదన్నారు.సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు సెంట్రల్ బోర్డ్ లేబర్ ఆక్ట్ ప్రకారం వేతనాలు చెల్లింపులు జరగడం లేదని గెజిట్ నెంబర్ 22 ను విడుదల చేసి కాంట్రాక్ట్ కార్మికులకు తగున్యాయం చేయాలని ఎమ్మెల్యే కోరారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!