ఉద్యోగాలు,ఇసుక,బూడిద అమ్ముకునే తప్ప అభివృద్ధి ఎక్కడుంది ఠాగూర్
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 30: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30వ డివిజన్లో మంగళవారం రోజున రజిత,శోభలు ఏర్పాటు చేసిన మహిళ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ వారి సతీమణి మనాలి ఠాగూర్ ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా రామగుండం నియోజకవర్గ సమస్యలపై ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న నన్ను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఓసిపిలతో బొందల గడ్డలు అవుతాయని ఓసిపి కాకుండా కుర్చీ వేసుకుని ఓసిపి కాకుండా అడ్డుకుంటానని చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ఓసిపిని చేసి గోదావరిఖని ప్రాంతాన్ని బొందలగడ్డగా మారుస్తున్నారని ఆరోపించారు.ఉద్యోగాలు,ఇసుక,బూడిద అన్ని అమ్ముకోవడమే తప్ప రామగుండం నియోజకవర్గ అభివృద్ధి చేయడంలో రామగుండం శాసనసభ్యులు విఫలమయ్యారని ఆరోపించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పేద ప్రజలను ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!