ప్రజల రక్షణ భద్రత పోలీస్ బాధ్యత
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 25: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నెన్నల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోనంపేట గ్రామంలో ఏసీపి సదయ్య ఆధ్వర్యంలో బెల్లంపల్లి రూరల్ సిఐ రాజ్ కుమార్ గౌడ్,నెన్నల్ ఎస్ ఐ శ్యామ్ పటేల్ 20 మంది పోలీసులతో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించి స్థానిక ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల రక్షణ,భద్రత పోలీస్ బాధ్యత అని గ్రామాల్లో కొత్త వ్యక్తులు,నేరస్తులు షెల్టర్ తీసుకొని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. యువత చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని,చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలని లేదా 100కు డయల్ చేసి సమాచారాన్ని అందించాలని సైబర్ నేరగాళ్ల ఫోన్ కాల్స్, మెసేజ్ లకు స్పందించకూడదని సూచించారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని,ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని,చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. గ్రామాల్లో మరింత రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని భద్రతా పరమైన అంశాలలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ రవికుమార్,పోలీస్ సిబ్బంది,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!