నార్కట్ పల్లి డిపో ఎత్తివేతను ఉపసంహరించుకోవాలి . సిపిఐ
స్వాతంత్రానికి పూర్వం నార్కట్పల్లిలో నిర్మించిన ఆర్టీసీ బస్సు డిపో ఎత్తివేతకు స్థానిక ఎమ్మెల్యే బాధ్యత వహించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. సిపిఐ జీప్ జాత శనివారం మూడవరోజు నార్కెట్పల్లి పట్టణానికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నార్కెట్పల్లి బస్ డిపో వద్ద ఏర్పాటుచేసిన మీటింగ్లో శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజలు దాదాపు 10 మండలాలకు సంబంధించిన విద్యార్థులు బస్సు పాసుల ద్వారా కాలేజీలకు పోకుండా చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడనుందని ఆయన పేర్కొన్నారు. దశాబ్ద కాలంగా సరిపడా నిధులు కేటాయించకపోవడం వల్ల బీ వేలంలో ప్రాజెక్టు పూర్తికి నోచుకోలేకపోయిందని ఆయన ఆరోపించారు. రైతు లకు రుణమాఫీ చేయకుండా బ్యాంకుల్లో కిస్తీలు కట్టలేక రైతుల అప్పుల పాలవుతున్నారని ఆయన అన్నారు. రెండు సంవత్సరాల క్రితం ప్రకటించిన దళిత బంధు పథకం దళితులకు అందజేయకుండా మోసం చేస్తూ ఆలయాపన చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఏడు సంవత్సరాల క్రితం ప్రకటించిన పెన్షన్లను వెంటనే రెట్టింపు చేసి పేద ప్రజలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రచార జాత కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పెండ్యాల శంకర్, చిట్యాల మండల కార్యదర్శి ఎండి అక్బర్, నకిరేకల్ మండల కార్యదర్శి గౌను లక్ష్మీనరసయ్య, వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ అధ్యక్షులు వెంపటి శ్రీనివాస్, రైతు సంఘం నాయకులు ఏనుగుల యోగేందర్ రెడ్డి, నార్కట్పల్లి పట్టణ కార్యదర్శి శ్రీపతి స్వామి , తోడుసు సైదులు, బీసీ సంఘం మండలాధ్యక్షుడు రావుల చిన్న వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!