పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు3: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి ఆర్మెడ్ రిజర్వ్ విభాగం నందు హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తూ ఏఆర్ ఎస్ ఐగా పదోన్నతులు పొందిన 11 మంది సిబ్బందిని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీమతి రెమ రాజేశ్వరి ఐపీఎస్(డిఐజి)వారి కార్యాలయంలో అభినందించారు.ఈ సందర్భంగా సిపి మేడం మాట్లాడుతూ పోలీస్ శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని పెరిగిన బాధ్యతను క్రమశిక్షణతో నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని,గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలని అన్నారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కష్టపడి పనిచేసే పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.ప్రజలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని,కష్టపడి పని చేస్తే ఎప్పటికైనా మంచి గుర్తింపు లభిస్తుందని,ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని పోలీసులు శ్రమిస్తూ వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకుండా ఉంటారు,వయసు పైబడిన అనంతరం ఆ వ్యాధి బాధలు తెలుస్తాయని,సమయం దొరికినప్పుడల్లా యోగ వాకింగ్ రన్నింగ్ చేయాలని సూచించారు.ప్రతి ఒక్కరు ఆరోగ్య పరిరక్షణ గురించి పాటుపడాలని ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించగలుగుతామని ఈ సందర్భంగా వారు సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ ఏసిపి సుందర్ రావు,ఆర్ఐలు దామోదర్,విష్ణుప్రసాద్ లు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!