ఇప్పటివరకు నాకు సహాయం చేయడానికి ఎవరూ రాలేదు మీరోచ్చారు: సర్వర్ చాచా
స్వేచ్ఛ న్యూస్ రామగుండం మే 30: అబితక్ హమారా పరివార్పే కోయి బి ఇత్న మొహబ్బత్ నహి దికాయ! హమారాకో మద్దత్ కర్నే కే లియే ఆప్ హమారే ఘర్ ఖుద్ ఆయే! అంటూ ఉద్వేగ భరితమైన ఆనందభాష్పాలతో కన్నీటి పర్యంతమయ్యాడు సర్వర్ చాచా. వివరాల్లోకి వెళితే అంతర్గాం మండలం మురుమూరు గ్రామానికి చెందిన సర్వర్-అమినాబి దంపతులకు ఒక్కగానొక్క కూతురు రెహనా బేగంకు మంచిర్యాల జిల్లా లక్షట్ పేట మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన ఇబ్రహీంకిచ్చి వివాహం చేశారు. ప్రభుత్వ సహాయం కోసం షాది ముబారక్ పథకం కింద దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఒక లక్ష 116 రూపాయల విలువగల చెక్కును రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే కోరకంటి చందర్ మంగళవారం రోజున స్వయంగా వారి ఇంటికి వెళ్లి ఇచ్చారు. ఎమ్మెల్యే స్వయంగా వారి ఇంటికి వెళ్లి ఒక్క లక్ష 116 రూపాయల విలువ గల చెక్కును ఇవ్వడంతో ఉద్వేగానికి గురైన సర్వర్ కళ్ళ నుండి ఆనందభాష్పాలు రాలుతుండగా ఇప్పటిదాకా మా కుటుంబం పై ఇంత ప్రేమను చూపెట్టిన వారు లేరని నువ్వు స్వయంగా మా ఇంటికి వచ్చావా అంటూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపగా సర్వర్ భుజం తట్టి ఓదార్చారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!