సింగరేణి వారసత్వ ఉద్యోగాల కల్పనలో భారీ కుంభకోణం
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 12: సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగ కల్పనలో భారీ కుంభకోణం జరిగిందని డిసిసి అధ్యక్షులు రాజ్ ఠాకూర్ ఆరోపించారు.ఈ మేరకు గోదావరిఖని మార్కండేయ కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా వారసత్వ ఉద్యోగాల పేరిట కొందరు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.వారసత్వ ఉద్యోగ కల్పనపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పొందిన మహిళల పట్ల యజమాన్యం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు.నిబంధనలకు విరుద్ధంగా మహిళా కార్మికులతో విధులు నిర్వహింప చేస్తున్నారని,సింగరేణిలో అనేక విభాగాలు ఉన్నప్పటికీ బొగ్గు వెలికితీత పనులను మహిళలతో చేయిస్తున్నారని అన్నారు.వెంటనే మహిళా ఉద్యోగులకు సముచిత పని స్థలాలలో పని కల్పించాలని డిమాండ్ చేశారు.మహిళా ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఈ సమావేశంలో తెలిపారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!