రామగుండం ప్రాంతాన్ని చీకటిమయం చేయాలని చూస్తున్నారన్న ఠాగూర్
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, నవంబర్ 13: ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండం పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 20,21,22 డివిజన్లలో నిర్వహించిన పాదయాత్ర కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని ఇంటింటా ప్రజలను కలిసి చేతి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా ఠాగూర్ మాట్లాడుతూ బి పవర్ ప్లాంట్ మూసివేసి ఈ ప్రాంతాన్ని చీకటిమయం చేయాలని బిఆర్ఎస్ చూస్తుందని ఆరోపించారు.ఈ ప్రాంతం బాగుపడాలి అంటే దోపిడీ జరగవద్దు ప్రశ్నించేవారు ఉండాలని అన్నారు.స్థానిక శాసనసభ్యుని చాతకానితనంతో ఈ ప్రాంతం అభివృద్ధి కాలేదని ఆరోపించారు.కుందనపల్లి బూడిదను అమ్ముకుంటున్నాడని అన్నారు.కుందనపల్లి గ్రామ ప్రజలకు అండగా ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు.గోదావరి నదిలో నిండా నీళ్లు ఉన్న దూకి చావడానికి తప్ప తాగడానికి పనికి రావడం లేదని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆటో డ్రైవర్లను కార్మికులుగా గుర్తించి వారికి ఇండ్లు ఇస్తామని,ఇంటి స్థలాలు ఉంటే ఐదు లక్షల రూపాయలు ఇల్లు నిర్మాణానికి ఇస్తామని ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ₹10,000 ఆర్థిక సాయం అందిస్తామన్నారు. బిఆర్ఎస్ పార్టీ అడ్డగోలుగా ఉద్యోగాల దోపిడీ,ఇసుక దోపిడీ,బూడిద దొంగతనం చేసి అక్రమంగా సంపాదించిన డబ్బుతో పదివేల రూపాయలు ఇచ్చి ఓట్లు కొని మిమ్మల్ని మోసం చేయాలని చూస్తుందని ఆరోపించారు.ప్రజాహితం కోరే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు. బిఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,దళిత బంధు,బీసీ బందు,మైనార్టీ బందు,ఇంటికో ఉద్యోగం,మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మోసం చేసిందని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబానికి 500 కే గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ,ఇంటి స్థలం ఉంటే ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు.మహిళలకు ఆర్.టి బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు.ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి పోరాటం చేస్తున్నానని కాబట్టి చేతి గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్పొరేటర్లు,వివిధ డివిజన్ల నాయకులు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!