అన్నా అంటే వెన్నంటి నిలుస్తడు కేటీఆర్
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జులై 24: రాష్ట్ర పురపాలక పరిశ్రమల ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని వారి పిలుపు మేరకు గిఫ్ట్ స్మైల్ లో భాగంగా సోమవారం రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలం గోలి వాడకు చెందిన నిరుపేద ఒంటరి మహిళ గాదేం రాజమ్మ నూతన ఇల్లును ఎమ్మెల్యే గిఫ్ట్ గా అందించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.అనంతరం కోరుకంటి చందర్ మాట్లాడుతూ అన్నా అంటే వెన్నంటి ఉండి అభయ హస్తాన్ని అందించి పేదల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యం ఉన్న గొప్ప మహా నాయకుడు కేటీఆర్ అని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ సంస్థలను తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చి నిరుద్యోగులకు,పేదలకు ఉపాధి అవకాశాన్ని కల్పించిన ఘనత కేటి రామన్నదని అన్నారు. కేటీఆర్ పిలుపు మేరకు నిరాడంబర జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నామని ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఆముల నారాయణ,రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ బింగి అనిల్ కుమార్,వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి,మండల కోఆప్షన్ సభ్యులు గౌస్ పాషా,ఫ్యాక్స్ చైర్మన్ మామిడాల ప్రభాకర్,సర్పంచులు ధరణి రాజేష్,బాధరవేణి స్వామి,ధర్మాజీ,కృష్ణ,బండారి ప్రవీణ్,తుంగపిండి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!