శ్రీ కృష్ణార్జునులను దర్శించుకున్న మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జులై 28: గోదావరిఖని ప్రధాన చౌరస్తాకు సమీపంలో ని హనుమానగర్ లో గల శ్రీ కృష్ణార్జున దేవాలయంలో అధిక శ్రావణ మాసం సందర్భంగా నిర్వహించిన సుదర్శన యాగానికి విచ్చేసిన పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ శ్రీ కృష్ణార్జునులైన ఆ భగవంతుని దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గం ప్రజలు ఎప్పుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఉండాలని అధిక వర్షాల కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న వరద దాటి నుండి వారిని కాపాడాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో 41 వ డివిజన్ కార్పొరేటర్ గాదం విజయ-నందు,కార్పొరేటర్ మహంకాళి స్వామి,చుక్కల శ్రీనివాస్,రాజిరెడ్డి,యుగేందర్,దాసరి,విజయ్,తిరుపతి రెడ్డి,శివ,చంటి ఆలయ ధర్మకర్త,సేవకులు తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!