ప్రజల ఇబ్బందులు పట్టించుకోని మేయర్, ఎమ్మెల్యే
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జులై 18: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సప్తగిరి కాలనీలో డ్రైనేజీ రోడ్లు సరిగా లేకపోవడంతో వర్షానికి నీరు నిలిచి రోడ్లు గుంతలుపడి రాకపోకలకు ఇబ్బందిగా ఉందని వెంటనే రోడ్లు వేసి సమస్యను పరిష్కరించాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాగుర్ పాలకవర్గ అధికారులను మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే మేయర్ రామగుండం శాసనసభ్యులు ఒకసారి సప్తగిరి కాలనీ రోడ్లను పరిశీలించాలని డిమాండ్ చేశారు. కాలనీ ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారని రోడ్లు వర్షపు నీటితో బురిదమయమై ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని వెంటనే రోడ్లు వేసి సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!